Soldier Rescued | మంచులో చిక్కుకున్న సైనికుడు.. మూడు రోజుల తర్వాత రక్షించిన రెస్క్యూ సిబ్బంది
Soldier Rescued | భారత్-చైనా సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న సైనికుడు అదృశ్యమయ్యాడు. అయితే మూడు రోజులుగా మంచులో చిక్కుకున్న అతడ్ని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న సైనికుడి కుటుంబం ఊరట చెందింది.
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న సైనికుడు అదృశ్యమయ్యాడు. అయితే మూడు రోజులుగా మంచులో చిక్కుకున్న అతడ్ని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. (Soldier Rescued) ఈ విషయం తెలుసుకున్న సైనికుడి కుటుంబం ఊరట చెందింది. బీహార్‌లోని బక్సర్‌కు చెందిన అనిల్ రామ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. భారత్-చైనా సరిహద్దులో మున్సియారి నుంచి మిలామ్ వరకు గస్తీ కోసం మోహరించిన బృందంలో అతడు ఉన్నాడు.
కాగా, మూడు రోజుల కిందట జవాన్ అనిల్ రామ్, పోర్టర్ దేవేంద్ర సింగ్ అదృశ్యమయ్యారు. ఈ విషయం తెలిసి వారి కుటుంబాలు ఆందోళన చెందాయి. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆ ప్రాంతంలో వెతికింది.
మరోవైపు జవాన్ అనిల్, అతడి పోర్టర్ దేవేంద్ర సింగ్, భారీ మంచు కారణంగా దారి తప్పారు. మంచులో చిక్కుకున్న వారిద్దరూ మున్సియారీకి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుహలో ఆశ్రయం పొందారు. మూడు రోజులుగా ఆ గుహలోనే ఉన్నారు.
కాగా, రెస్క్యూ బృందం 36 గంటలపాటు వారి కోసం వెతికింది. ఎట్టకేలకు మూడో రోజు అనిల్, దేవేంద్రలను గుర్తించారు. మంచుతో కప్పి ఉన్న గుహ నుంచి వారిని కాపాడారు. జవాన్ అనిల్‌ను ఉత్తరాఖండ్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- border
- buried
- india china
- Rescued
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

