Burglars gang rape woman | ఆభరణాలు దోచుకున్న తర్వాత.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దొంగలు
Burglars gang rape woman | ఒక అపార్ట్మెంట్లోకి చొరబడిన దొంగలు ఒక మహిళను బెదిరించి ఆమె ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమె కుమార్తెను చంపుతామని బెదిరించి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భువనేశ్వర్: ఒక అపార్ట్మెంట్లోకి చొరబడిన దొంగలు ఒక మహిళను బెదిరించి ఆమె ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమె కుమార్తెను చంపుతామని బెదిరించి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Burglars gang rape woman) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 30న తెల్లవారుజామున 2 గంటలకు భువనేశ్వర్‌లోని మైత్రి విహార్‌లో ఒక ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. రెండేళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్న 27 ఏళ్ల మహిళను కత్తితో బెదిరించారు. మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ల కుమార్తెను చంపుతామని బెదిరించి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఆ మహిళ 10 రోజుల క్రితమే ఆ ఫ్లాట్‌లోకి మారిందని పోలీసులు తెలిపారు. దొంగలు వెదురు కర్రల సహాయంతో ఆమె అపార్ట్మెంట్లోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ బిల్డింగ్ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో సమీప ప్రాంతాల్లోని ఫుటేజ్‌ను పరిశీలిసున్నట్లు పోలీస్ అధికారి చెప్పారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

