PM Modi | ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఆర్థిక నిపుణులతో ప్రధాని భేటీ..!
PM Modi | వచ్చే ఏడాది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు.
PM Modi | వచ్చే ఏడాది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతారు. ఈ సమావేశంలో సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, సుర్జిత్ భల్లా, డీకే జోషి సహా ప్రముఖ ఆర్థికవేత్తలు సమావేశానికి హాజరయ్యారు.
ఇదిలా ఉండగా భారతదేశ 2024-25 ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో ప్రధాని సమావేశం నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 5.4 శాతానికి పడిపోయింది. దాదాపు రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. ఆర్బీఐ, రేటింగ్ ఏజెన్సీల అంచనాల కంటే ఘోరంగా తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జిడిపి ఏకంగా 8.1 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. గడిచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6.7 శాతానికి పరిమితమైంది. ఈ రెండింటితోనూ పోల్చినా జీడీపీ భారీ తగ్గుదల నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు రేటింగ్ ఏజెన్సీలు కూడా 6శాతం ఎగువన వృద్ధి ఉండొచ్చని అంచనా వేయగా.. వాటి కంటే తక్కువగా పడిపోవడం గమనార్హం.
జీడీపీ 7శాతం పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేయగా.. అంచనాలకు మంచి జీడీపీ పతనమైంది. రాబోయే బడ్జెట్లో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుందా? లేదంటే సంస్కరణలు తీసుకువస్తుందా? అనేది ఆసక్తి నెలకొన్నది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ట్రంప్ భారత్, చైనా, బ్రెజిల్ సహా ఇతర దేశాల వస్తువులపై సుంకాలను పెంచనున్నట్లు హెచ్చరించారు. మరో వైపు ఈ నెల 20న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఆర్థిక మంత్రి ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించారు. పంజాబ్, కేరళ సహా పలు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు కేంద్రం నుంచి ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, మూల ధనం వ్యయం కోసం 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాల కేటాయింపును పెంచాలని కేంద్రాన్ని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

