Budget-2024 | వందే భారత్ కోచ్‌ల తరహాలో 40వేల బోగీల అభివృద్ధి : నిర్మలా సీతారామన్
Budget-2024 | బడ్జెట్ ప్రసంగంలో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంటుందని ఫైనాన్స్ మినిస్టర్ తెలిపారు.
Budget-2024 | బడ్జెట్ ప్రసంగంలో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంటుందని ఫైనాన్స్ మినిస్టర్ తెలిపారు. ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కోసం మూడు రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వందే భారత్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దేశంలోని ఇతర నగరాలతో మెట్రో రైలు నమో భారత్ అనుసంధానిస్తుందన్నారు.
పలు నగరాల్లో ప్రారంభించిన వందేభారత్ రైళ్లలో పెద్ద ఎత్తున అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. వందే భారత్ తరహాలో 40వేల కొత్త బోగీలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను పెంచనున్నట్లు చెప్పారు. దేశంలోని వివిధ నగరాలను మెట్రో రైలు, నమో భారత్‌తో అనుసంధానించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. విమానయాన రంగంపై సైతం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో కొత్త విమానాశ్రయాలను ప్రారంభిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం దశాబ్దకాలంలో విమానాశ్రయాల సంఖ్యను 149కి పెంచనున్నది. ఉడాన్ పథకం కింద 517 కొత్త మార్గాలను అనుసంధానించనున్నారు. టైర్-2, టైర్-3 నగరాల్లో ఉడాన్ పథకం విజయవంతమైందని కేంద్రం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

