BSF Jawan@ PAK | పాకిస్తాన్లోకెళ్లిన మరో బీఎస్ఎఫ్ జవాన్.. పొగమంచుతో కనిపించని జీరో లైన్
BSF Jawan@ PAK | సరిహద్దులో తీవ్రమైన పొగమంచు కప్పిఉన్నది. పహారా కాస్తున్న ఓ జవాను పొరపాటుగా అంతర్జాతీయ సరిహద్దు జీరో లైన్ దాటి పాక్ భూభాగంపైకి వెళ్లాడు. దాంతో పాక్ రేంజర్లు ఆ జవానును అదుపులోకి తీసుకున్నారు. మన అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
BSF Jawan@ PAK | మరో బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లిపోయాడు. భారత జవానును గుర్తించిన పాక్ రేంజర్లు ఆయనను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. సరిహద్దులో తీవ్రమైన పొగమంచు కారణంగా జీర్ లైన్ కనిపించకపోవడం వల్లనే జవాన్ పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన బీఎస్ఎఫ్ ఫిరోజ్‌పూర్ సెక్టర్లో జరిగింది.
పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అబోహర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ బుధవారం ఉదయం 7.40 గంటలకు పొరపాటున జీరో లైన్‌ను దాటి పాకిస్తాన్ భూభాగానికి చేరుకున్నాడు. పాకిస్తాన్ ప్రాంతానికి చేరుకోగానే పాక్ రేంజర్లు భారత జవాన్‌ను అరెస్ట్ చేశారు. సదరు జవాన్ బీఎస్‌ఎఫ్‌లోని 66 బెటాలియన్‌కు చెందినవాడు. దట్టమైన పొగమంచు కారణంగా సరిహద్దు దాటినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జవాను సరిహద్దు దాటినట్లు సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. భారత జవాను తమ నిర్బంధంలో ఉన్నట్లు పాక్ రేంజర్లు ధృవీకరించారు. మన జవాన్‌ను తిరిగి పంపేందుకు పాక్ రేంజర్లు నిరాకరించారు.
పొగమంచు కారణంగా తమ సహచర జవాను కనిపించకుండా పోయిన విషయం మిగిలిన జవాన్లు గుర్తించలేదు. కొంత సేపటి తర్వాత వారు గుమిగూడటంతో ఒక జవాన్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చాలాసేపు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బెటాలియన్‌లో కలకలం రేగింది. గత వారం కూడా ఓ బీఎస్ఎఫ్ జవాను ఇలాగే దారి తప్పి పాక్ భూభాగంలో వెళ్లిపోయాడు. బీఎస్ఎఫ్ అధికారులు పాక్ రేంజర్లను సంప్రదించి జవానును క్షేమంగా తీసుకురాగలిగారు. ప్రస్తుతం జవాన్‌ను వదిలిపెట్టడానికి పాక్ రేంజర్లు నిరాకరించడంతో బీఎస్ఎఫ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

