BSF Dog | బార్డర్లో ప్రసవించిన బీఎస్ఎఫ్ డాగ్.. విచారణకు ఆదేశం
బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్)కు చెందిన ఓ స్నిఫర్ డాగ్ లాల్సీ (Lalcy) బంగ్లాదేశ్ బార్డర్లో ప్రసవించింది. డిసెంబర్ 5న ఉదయం బగ్మారా బీఓపీ వద్ద మూడు కుక్క పిల్లలకు లాల్సీ జన్మనిచ్చింది. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు.
BSF Dog | బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్)కు చెందిన ఓ స్నిఫర్ డాగ్ లాల్సీ (Lalcy) బంగ్లాదేశ్ బార్డర్లో ప్రసవించింది. డిసెంబర్ 5న ఉదయం బగ్మారా బీఓపీ వద్ద మూడు కుక్క పిల్లలకు లాల్సీ జన్మనిచ్చింది. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు.
రూల్స్ ప్రకారం.. హై సెక్యూరిటీ జోన్లో ఉన్న శునకాలు గర్భం దాల్చకూడదు. ఫోర్స్‌లోని వెటర్నరీ వింగ్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు మాత్రమే అవి గర్భం దాల్చాల్సి ఉంటుంది. అలా కాకుండా సెక్యూరిటీ జోన్లో ఉన్న ఏ శునకమైనా గర్భం దాల్చిదే అది నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తారు.
బంగ్లాదేశ్ సరిహద్దులోని మేఘాలయాలో గల షిల్లాంగ్‌లోని బార్డర్ ఔట్ పోస్టు(బీవోపీ) హై సెక్యూరిటీ జోన్లో ఉన్న లాల్సీ ప్రసవించడంపై బీఎస్ఎఫ్, 170 బెటాలియన్ ఆఫీస్ కమాండెంట్ ధనక్గిరి స్పందించారు. ఘటనపై విచారణ చేపట్టాలని డిప్యూటీ కమాండెంట్‌ను ఆదేశించారు. 43వ బెటాలియన్‌కు చెందిన డాగ్ లాల్సీ ఏ పరిస్థితుల్లో గర్భం దాల్చి మూడు కుక్క పిల్లల్ని ప్రసవించిందో దర్యాప్తు చేపట్టాలన్నారు.
కాగా, ఈ ఘటనపై బీఎస్ఎఫ్ వెటర్నరీ వింగ్ సీనియర్ ఆఫీసర్ ఒకరు స్పందిస్తూ.. ‘మేము శిక్షణ ఇచ్చిన శునకం గర్భం దాల్చడానికి సంబంధించి ఓ ప్రొసీజర్ ఉంటుంది. శునకాన్ని హ్యాండిల్ చేస్తున్నవారి నిర్లక్ష్యం కారణంగా లాల్సీ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది’ అని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bangladesh
- border
- BSF Dog
- Shillong
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

