Rishi Sunak | లిజ్‌ట్రస్ పొరపాట్లను సరి చేస్తా.. కఠిన నిర్ణయాలు తప్పవ్.. రిషి సునాక్ హెచ్చరికలు!
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని రిషి సునాక్ తేల్చి చెప్పారు.
Rishi Sunak | దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అంతటా ప్రొఫెషనలిజంతో కూడిన అకౌంటబిలిటీ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక సుస్థిరత తీసుకొస్తానని పేర్కొన్నారు.
మంగళవారం బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత అధికార నివాసరం డౌనింగ్ స్ట్రీట్-10 నుంచి రిషి సునాక్ మాట్లాడారు. ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్తిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని లిజ్ ట్రస్ హయాంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్దుతానని రిషి సునాక్ స్పష్టం చేశారు. ఆర్థిక సుస్థిరత, విశ్వాసం కల్పించడమే తమ ప్రభుత్వ ఏజెండా అని అన్నారు. తక్షణం తమ ప్రభుత్వ పనితీరు మొదలవుతుందని వెల్లడించారు.
ఇంతకుముందు బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ప్రజలను, వ్యాపారాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నానని, ఇప్పుడు దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడవేసేందుకు అవే చర్యలు తీసుకుంటామన్నారు. భావి తరాలను అప్పుల ఊబిలో దించలేనని స్పష్టం చేశారు. కబుర్లతో కాలక్షేపం చేయకుండా దేశ ఐక్యత కోసం కృషి చేస్తానని రిషి సునాక్ హామీ ఇచ్చారు. మనమంతా కలిసి పని చేస్తే నమ్మశక్యం గానీ విజయాలను సాధించగలమని చెప్పారు.
రాజకీయ నాయకుడిగా మారిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రిషి సునాక్ (42).. బ్రిటన్ ప్రధానిగా అతి పిన్న వయస్కుడు. గత 210 ఏండ్లలో అత్యంత చిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేతగా రిషి సునాక్ నిలిచారు.
లక్షల మంది బ్రిటన్ వాసులు ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యావత్ దేశం నిధుల లేమిని ఎదుర్కొంటున్నదని, తాను తప్పనిసరిగా ఆర్థిక సంక్షోభానికి పరిష్కార మార్గాలు వెతకడంపైనే దృష్టి సారిస్తానని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

