Watch: హాస్పిటల్లో బయటపడిన.. బ్రిటీష్ కాలం నుంచి రహస్య సొరంగం
ఈ భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని రెండు రోజుల కిందట గుర్తించారు. దీని శిలాఫలకంపై 1890 అని ఉంది.
ముంబై: బ్రిటీష్ కాలం నాటి రహస్య సొరంగం బయటపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్ ప్రాంగణంలో దీనిని గుర్తించారు. నీటి లీకేజీని అరికట్టేందుకు తవ్వుతుండగా ఈ రహస్య సొరంగం బయటపడినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. గ్రాంట్ మెడికల్ కాలేజ్, సర్ జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ను జేజే హాస్పిటల్స్ అని పిలుస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అతి పురాతన వైద్య సంస్థ ఇది. మహిళలు, పిల్లలకు చికిత్సలు అందించిన వార్డు భవనాన్ని అనంతరం నర్సింగ్ కాలేజీగా మార్చారు.
కాగా, ఈ భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని రెండు రోజుల కిందట గుర్తించారు. దీని శిలాఫలకంపై 1890 అని ఉంది. దీంతో ఈ సొరంగాన్ని 132 ఏళ్ల కిందట నిర్మించినట్లు తెలుస్తున్నది. మరోవైపు ఈ రహస్య సొరంగాన్ని గుర్తించిన వెంటనే జిల్లా కలెక్టర్, పురావస్తు శాఖకు ఈ సమాచారాన్ని తెలిపినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. 1845లో నాటి బ్రిటీష్ పాలనలో ప్రారంభించిన చారిత్రక వైద్య కాలేజీ భవనం కింద రహస్య మార్గం ఉండవచ్చని ఎప్పటి నుంచో ఊహాగానాలున్నాయని వెల్లడించారు.
A 200-metre long tunnel discovered under the nursing complex of #JJHospital in #Byculla . The hospital is believed to have made the discovery two days ago while undertaking some digging work.#Mumbai pic.twitter.com/nbDfCH90UZ
— Siraj Noorani (@sirajnoorani) November 4, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

