Divorce Law: ఒకే విధమైన విడాకుల చట్టాన్ని రూపొందించండి.. సుప్రీంను కోరిన క్రికెటర్ షమీ భార్య
Shamis Wife: ఎవరికైనా విడాకుల చట్టం ఒకే రకంగా ఉండాలి. అలాంటి చట్టాన్ని తయారు చేయాలని క్రికెటర్ షమీ భార్య సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం అలాంటి పిటీషన్లను ఒకే దగ్గరకు చేర్చింది.
న్యూఢిల్లీ: ఏకీకృత విడాకుల చట్టాన్ని(Divorce Law) రూపొందించాలని క్రికెటర్ మహమ్మద్ షమీ భార్య వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విడాకుల అంశాలపై ఉన్న ఇతరు పిటీషన్లతో షమీ భార్య అభ్యర్థనను కూడా సుప్రీం జోడించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ప్రక్రియ చేపట్టింది. అడ్వకేట్ దీపక్ ప్రకాశ్ ఈ అభ్యర్థనను ఫైల్ చేశారు. ఎక్స్ట్రా జుడిషియల్ తలాక్, తలాక్-ఉల్-హసన్ లాంటి ఏకపక్ష విధానాలతో విసుగెత్తిపోయినట్లు షమీ భార్య తన అభ్యర్థనలో తెలిపారు.
2022, జూలై 23వ తేదీన తలాక్ ఉల్ హసన్ కింద తనకు షమీ నుంచి విడాకుల పిటిషన్ అందినట్లు ఆమె తెలిపారు. తలాక్ ఉల్ హసన్ కింద అనేక మంది విడాకులు తీసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. లింగ బేధం లేకుండా, మత తటస్టమైన ఏకీకృత విడాకుల విధానాన్ని తయారు చేయాలని ఆమె తన పిటిషన్లో కోరారు. తలాక్ ఈ హసన్ విధానం అప్రజాస్వామికమని ప్రకటించాలన్నారు. 1939 నాటి ముస్లిం మ్యారేజ్చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

