Viral Video | అల్లుడిని సిగరెట్‌తో ఆహ్వానించిన అత్తమామలు..
Viral Video | కొత్త అల్లుడికి అత్తమామలు వినూత్నంగా ఆహ్వానం పలికారు. వధువు పక్కనే కూర్చున్న వరుడి నోట్లో సిగరెట్ పెట్టి దాన్ని వెలిగించారు అత్తమామలు.. అనంతరం పాన్ తినిపించారు. అయితే సిగరెట్ తాగే అలవాటు లేకపోవడంతో.. కొత్త అల్లుడు కొంత కంగారు పడినట్లు వీడియోలో తెలుస్తోంది.
Viral Video | పెళ్లంటే నూరేళ్ల పంట. మరి అంతటి ప్రాధాన్యం ఉన్న పెళ్లికి అటు అబ్బాయి, ఇటు అమ్మాయి కుటుంబ విషయాలను, ఇతర అలవాట్లను నిశితంగా పరిశీలిస్తారు. అబ్బాయికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా? మద్యం, సిగరెట్ తాగే అలవాటు ఉందా..? పాన్, గుట్కా తింటాడా? అంటూ అనేక సందేహాలు వ్యక్త పరుస్తుంటారు అమ్మాయి తరపువారు. ఒక వేళ అలాంటి చెడు అలవాట్లు ఏవైనా ఉంటే ఆ సంబంధాన్ని మొదట్లోనే క్యాన్సిల్ చేస్తారు. కానీ ఈ అత్తమామలు మాత్రం.. అల్లుడి నోట్లో సిగరెట్ పెట్టి, దాన్ని వెలిగించి ఆహ్వానించారు. అంతే కాదండోయ్.. పాన్ కూడా తినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నూతన వధూవరులిద్దరూ అందంగా ముస్తాబై పెళ్లి వేదికపై ఆశీనులయ్యారు. ఇక తమ కుమార్తె పెళ్లి వేడుకతో ఆమె తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. అల్లుడి గారికి వినూత్నంగా ఆహ్వానం పలికారు. వధువు పక్కనే కూర్చున్న వరుడి నోట్లో అత్త సిగరెట్ పెట్టగా, మామ అగ్గిపుల్లతో దాన్ని వెలిగించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. అనంతరం పాన్ తినిపించారు. అయితే సిగరెట్ తాగే అలవాటు లేకపోవడంతో.. కొత్త అల్లుడు కొంత కంగారు పడినట్లు వీడియోలో తెలుస్తోంది.
అయితే దక్షిణ గుజరాత్ పరిధిలోని పలు గ్రామాల్లో.. పెళ్లి సమయంలో కొత్త అల్లుడికి సిగరెట్‌తో ఆహ్వానం పలుకడం ఆచారమట. వరుడికి సిగరెట్ అలవాటు ఉన్నా.. లేకున్నా.. సిగరెట్ కాల్చక తప్పదట. ఈ ఆచారం ఎప్పట్నో నుంచి కొనసాగుతోందట.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

