ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కొన్ని కొన్ని పెళ్లి వేడుకల్లో వింత, సరదా సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. పెళ్లిపీటల దాకా వచ్చిన వరుడి అసలు రూపం చూసిన వధువు పెళ్లికి నిరాకరించింది. ఆ వరుడిని పెళ్లి చేసుకునేదేలేదని పట్టుబట్టి పంతం నెగ్గించుకుంది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది. వరుడికి బట్టతల ఉంది. అయితే, పెళ్లిచూపులకు విగ్గుపెట్టుకొని వచ్చాడు. ఎవరికీ అనుమానం రాలేదు. పెళ్లి ఫిక్స్ అయింది. వివాహ వేడుకలు సగం పూర్తయిన తర్వాత సీన్ మారిపోయింది. వరుడు మండపంలోకి వచ్చేటప్పుడు తలతిరిగిపడిపోయాడు. విగ్గు ఊడిపోయి, బట్టతల బయటపడింది. ఇదిచూసిన వధువు పెళ్లికి నిరాకరించింది.
ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్ దాకా చేరింది. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత కూడా వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అనంతరం పంచాయితీ నిర్వహించి, పెళ్లికి రూ.5.66 లక్షలు ఖర్చు చేసినట్లు బాలిక కుటుంబీకులు తెలిపారు. వరుడి తరపు వారుడిమాండ్కు అంగీకరించి ఆ డబ్బును వధువు తండ్రికి తిరిగి ఇచ్చేశారు. వధువు పెళ్లికి సిద్ధంగా లేదని, ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిందని పరియార్ పోలీస్ ఔట్ పోస్ట్ ఇన్ఛార్జ్ రామ్‌జీత్ యాదవ్ విలేకరులతో తెలిపారు.