Brain fog | కొవిడ్ సంబంధ బ్రెయిన్ ఫాగ్ పదేళ్ల వృద్ధాప్యానికి సమానమట.. తాజా అధ్యయనంలో వెల్లడి
Brain fog | కరోనా మహమ్మారి (Covid-19)’ సోకి తగ్గిన తర్వాత కూడా కొంతమందిలో దీర్ఘకాలం పాటు దాని తాలూకు దుష్ప్రభావాలు కనిపిస్తుంటాయి. దీన్నే సాధారణంగా ‘లాంగ్ కొవిడ్ (Long Covid)’ అంటారు. ఈ లాంగ్ కొవిడ్ కొందరికి పెను సవాల్‌గా మారింది. ఎందుకంటే కరోనా లక్షణాలు తగ్గిన తర్వాత రెండు సంవత్సరాల వరకు కూడా వ్యక్తులను ఈ లాంగ్ కొవిడ్ లక్షణాలు ఇబ్బంది పెడుతున్నాయి.
Brain fog: ‘కరోనా మహమ్మారి (Covid-19)’ సోకి తగ్గిన తర్వాత కూడా కొంతమందిలో దీర్ఘకాలం పాటు దాని తాలూకు దుష్ప్రభావాలు కనిపిస్తుంటాయి. దీన్నే సాధారణంగా ‘లాంగ్ కొవిడ్ (Long Covid)’ అంటారు. ఈ లాంగ్ కొవిడ్ కొందరికి పెను సవాల్‌గా మారింది. ఎందుకంటే కరోనా లక్షణాలు తగ్గిన తర్వాత రెండు సంవత్సరాల వరకు కూడా వ్యక్తులను ఈ లాంగ్ కొవిడ్ లక్షణాలు ఇబ్బంది పెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో లండన్‌లోని కింగ్స్ కాలేజీ కొవిడ్‌పైన, లాంగ్ కొవిడ్ లక్షణాలపైన ఒక అధ్యయనం చేసింది. మనిషి జ్ఞాపశక్తిపైన, మేథోసంపత్తిపైన కొవిడ్-19 ప్రభావం ఏ మేరకు ఉంటున్నది అనే విషయాన్ని అధ్యయనం ద్వారా పరిశీలించారు. అదేవిధంగా మూడు నెలలకు పైగా లాంగ్ కొవిడ్ లక్షణాలు కలిగివున్న వారిలో ‘బ్రెయిన్ ఫాగ్ (Brain fog)’ ఎంతలా వ్యాపిస్తుందనే విషయాన్ని పరిశోధకులు హైలైట్ చేశారు.
ఈ పరిశోధనలో మొత్తం 5,100 మంది పాల్గొన్నారు. కొవిడ్ లక్షణాల అధ్యయనం ‘బయో బ్యాంక్’ నుంచి స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా పరిశోధకులు వీరిని రిక్రూట్ చేసుకున్నారు. మొత్తం 12 రకాల పరీక్షల ద్వారా అధ్యయనకారులు మేథస్సు పనితీరును అంచనా వేశారు.
పార్టిసిపెంట్లలో జ్ఞాపశక్తి పనితీరు, ఏకాగ్రత, తర్క జ్ఞానం, శారీరక కదలికలు లాంటి వివిధ అంశాలను 2021, 2022 సంవత్సరాల్లో రెండు ప్రత్యేక సందర్భాల్లో పరిశీలించారు. మొదటి దఫాలో 2021 జూలై, ఆగస్టు నెలల్లో 3,335 మంది పార్టిసిపెంట్స్‌ను పరిశీలించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో మేథాశక్తి తగ్గడాన్ని గమనించారు. అదేవిధంగా 12 వారాలకు పైగా లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిలో మేథోపరమైన తీవ్ర లోపాలను గుర్తించారు.
ఈ లోపాల ప్రభావం మేథాసంపత్తిపై తీవ్రంగా ఉన్నది. మేథో లోపాలు ఉన్నవారిలో మెదడు పనితీరు వారి వయసుకు కంటే 10 సంవత్సరాల ఎక్కువ వయసుకు సమానంగా ఉన్నది. లాంగ్ కొవిడ్ లక్షణాలు ఉన్నవారిలో బ్రెయిన్ పనితీరు తగ్గిపోవడాన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. ఈ బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు ఉన్న వారి మెదడు వారి కంటే పదేళ్లు వృద్ధులైన వారి మెదడుకు సమానంగా పనిచేస్తున్నది. అంటే బ్రెయిన్ ఫాగ్ 10 ఏళ్ల వృద్ధాప్యానికి సమానం అన్నమాట. అయితే, లాంగ్ కొవిడ్ లక్షణాలవల్ల కలిగే మేథస్సు లోపం తక్కువ విద్యాజ్ఞానం, బలహీనతల వల్ల కలిగే మేథో లోపాల కంటే తక్కువ ప్రభావం చూపుతుందని పరిశోధకులు తేల్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

