Borsar | బూతులు మాట్లాడితే రూ 500 జరిమానా..! బోర్సర్ గ్రామం వినూత్న తీర్మానం
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో గల బోర్సర్ గ్రామం వినూత్న తీర్మానం చేసింది. గ్రామంలో ఎవరైనా బహిరంగంగా బూతులు మాట్లాడితే రూ.500 జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది.
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో గల బోర్సర్ గ్రామం వినూత్న తీర్మానం చేసింది. గ్రామంలో ఎవరైనా బహిరంగంగా బూతులు మాట్లాడితే రూ.500 జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది. అంతే కాకుండా అలాంటి వాళ్లతో అవసరమైతే వీధులు శుభ్రం చేయాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఈ తీర్మానాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని సంకల్పించింది.
6 వేల మంది నివాసితులు ఈ మేరకు ఈ నిబంధనను పాటిస్తామని ప్రమాణం చేశారు. గ్రామ సర్పంచ్ అంతర్ సింగ్, డిప్యూటీ సర్పంచ్ వినోద్ షిండే, సామాజిక కార్యకర్త అశ్విన్ పాటిల్ ఈ నిబంధనను రూపొందించారు. ‘12-13 ఏండ్ల పిల్లలు కూడా బహిరంగంగా బూతులు మాట్లాడుతున్నారు. రెండు, మూడు తీవ్రమైన వివాదాల్లో కొందరు వ్యక్తులు తల్లులు, అక్కా చెల్లెళ్లను ఉద్దేశించి బూతులు మాట్లాడారు. ఒకరు అసభ్యంగా మాట్లాడితే.. ఎదుటి వాళ్లు అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. దీంతో దీనికి ముగింపు పలకాలని ఈ నిర్ణయం తీసుకొన్నాం’ అని సర్పంచ్ తెలిపారు.
తమ గ్రామ తీర్మానాన్ని 20 మంది వార్డు సభ్యులు పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఈ తీర్మాన ప్రభావం అప్పుడే ఫలితాలను ఇస్తున్నదని.. స్థానికులు బహిరంగంగా బూతులు మాట్లాడేందుకు జంకుతున్నారని.. దీంతో మహిళలు సంతోషిస్తున్నారని ఆయన తెలిపారు. బూతులు మాట్లాడే వారికి నోటీస్ జారీ చేస్తామని ఆయన తెలిపారు. బూతులు మాట్లాడొద్దన్న తీర్మానం పోస్టర్లను గ్రామం అంతటా అతికించామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

