Malegaon Blast Case: 2006 మాలేగావ్ పేలుళ్ల కేసు.. నలుగురు నిందితులకు విముక్తి
Malegaon Blast Case: మాలేగావ్‌లో పేలుళ్ల కేసులో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు ఇవాళ విముక్తి కల్పించింది. ఆ కేసు నుంచి వాళ్లను డిశ్చార్జ్ చేసింది. ఆ నలుగురిపై స్పెషల్ కోర్టు నమోదు చేసిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది.
ముంబై: 2006లో మాలేగావ్‌లో జరిగిన పేలుళ్ల ఘటనతో లింకున్న కేసు(Malegaon Blast Case)లో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు ఇవాళ విముక్తి కల్పించింది. ఆ కేసు నుంచి వాళ్లను డిశ్చార్జ్ చేసింది. ఆ నలుగురిపై స్పెషల్ కోర్టు నమోదు చేసిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేకర్, జస్టిస్ శ్యామ్ చందక్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. రాజేంద్ర చౌదరీ, ధాన్ సింగ్, మనోహర్ రామ్ సింగ్ నర్వారియా, లోకేశ్ శర్మలు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు స్వీకరించింది. అయితే ఈ కేసులో కోర్టు ఆదేశాలకు చెందిన పూర్తి కాపీ ఇంకా అందాల్సి ఉన్నది. మాలేగావ్ పేలుళ్ల ఘటనలో నలుగురిపై ఐపీసీ, యూఏపీఏ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
2006 సెప్టెంబర్ 8వ తేదీన నాసిక్ జిల్లాలోని మాలేగావ్ పట్టణంలో నాలుగు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే శుక్రవారం ప్రార్థనలు ముగిసిన సమయంలో.. హమిదియా మజీద్, బడా ఖబరస్తాన్ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. ముషావరత్ చౌక్ వద్ద కూడా పేలుడు జరిగింది. ఆ పేలుళ్లలో మొత్తం 31 మంది మృతిచెందగా, మరో 312 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ఈ కేసును విచారించారు. ఈ కేసుతో లింకున్న 9 మంది ముస్లింలను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసును ఎన్ఐఏ తన ఆధీనంలోకి తీసుకున్నది. బ్లాస్ట్ వెనుక అతివాద తీవ్రవాదులు ఉన్నట్లు ఎన్ఐఏ ఆరోపించింది. దానిలో భాగంగా నలుగుర్ని అరెస్టు చేశారు.
స్పెషల్ కోర్టు తన ఆదేశాల్లో 9 మంది ముస్లింలను కేసు నుంచి రిలీజ్ చేసింది. ఇక గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఐఏ తన దర్యాప్తులో తమపై ఎటువంటి ఆధారాలను చూపలేదని నిందితులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
Karthika Pournami | యాదగిరిగుట్టలో భక్తుల సందడి
Microsoft Employee | 24 ఏళ్లు నమ్మకంతో పనిచేస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మెక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్టు
Panchayat 5 | ఫులేరాలో మారిన రాజకీయం.. ఆకట్టుకుంటున్న ‘పంచాయత్ 5’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

