Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Maharashtra : దీపావళి పండుగ రాబోతున్న వేళ టపాసులు కాల్చడంపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ల మీద, బహిరంగ ప్రదేశాలలో, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Maharashtra : దీపావళి పండుగ రాబోతున్న వేళ టపాసులు కాల్చడంపై మహారాష్ట్రకు చెందిన బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ల మీద, బహిరంగ ప్రదేశాలలో, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపింది. ఈ అంశంపై గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీపావళి, ఇతర పండుగల సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల జరుగుతున్న వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు తాజా ఆదేశాలు జారీచేసింది.
జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలే ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో డీజేల వినియోగం, లౌడ్ స్పీకర్లు, డాల్బీ సౌండ్ సిస్టమ్స్, లేజర్ లైట్లపై కూడా స్పందించింది. వీటి వాడకం విషయంలో తగిన నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ అంశంలో వారంలోగా స్పందించి, కఠిన చర్యలు అమలులోకి తేవాలని సూచించింది. పండుగల సందర్భంగా టపాసులు, సౌండ్ సిస్టమ్స్ వంటి వాటివల్ల తలెత్తుతున్న ఇబ్బందులపై దాఖలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఏ తరహా టపాసులు విక్రయించాలి.. వాటి తయారీలో నిబంధనలు వంటి వాటిపై స్పందించేందుకు కోర్టు నిరాకరించింది. గత నెలలో జరిగిన గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. వినాయక ఉత్సవాల సందర్భంగా టపాసులు కాల్చవద్దని సూచించింది. తాజాగా స్పందించిన కోర్టు.. టపాసుల వల్ల వెలువడే విష వాయువులతో వృద్ధులు, పిల్లలు, రోగులు ఇబ్బంది పడతారని కోర్టు వ్యాఖ్యానించింది. కాలం మారుతోందని.. ఇప్పుడు ఈ విషయంలో మారాల్సిన తరుణం వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.
ఇదే సమయంలో టపాసుల తయారీ, విక్రయాల వల్ల ఎందరికో ఉపాధి దొరుకుతుందన్న విషయాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. టపాసులు కాల్చే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రీన్ లేదా ఎకో ఫ్రెండ్లీ టపాసులు కాల్చేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

