వరవరరావు బెయిల్ పొడిగింపు

ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు బెయిల్‌ను వచ్చే నెల 5 వరకు బాంబే హైకోర్టు పొడిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు గతేడాది హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే పలుసార్లు ఈ బెయిల్‌ను పొడిగించిన హైకోర్టు శుక్రవారం కూడా మరోసారి పొడిగించింది. ‘ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలతోపాటు పోలీసులు, ఆరోగ్య సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో వరవరరావును జైలులో లొంగిపోవాలని ఆదేశించడం సరికాదు. అందుకే సమయాన్ని పొడిగిస్తున్నాం’ అని హైకోర్టు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Mumbai
- varavara rao
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

