హరిద్వార్ రైల్వేస్టేషన్, చార్‌ధామ్‌కు.. జైషే బాంబు బెదిరింపులు..!
bomb threat | హరిద్వార్‌లోని రైల్వేస్టేషన్లతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాలకు బాంబు బెదిరింపు లేఖలు రావడంతో కలకలం సృష్టిస్తున్నది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఏరియా కమాండర్ పేరిట శనివారం హరిద్వార్ రైల్వేస్టేషన్
న్యూఢిల్లీ : హరిద్వార్‌లోని రైల్వేస్టేషన్లతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాలకు బాంబు బెదిరింపు లేఖలు రావడంతో కలకలం సృష్టిస్తున్నది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఏరియా కమాండర్ పేరిట శనివారం హరిద్వార్ రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. ఈ క్రమంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ నెల 10న హరిద్వార్ రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ పేరుతో సాధారణ పోస్టు ద్వారా కార్యాలయానికి లేఖ వచ్చింది. స్టేషన్ సూపరింటెండెంట్ లేఖను తెరిచి చూడగా.. ఆయన షాక్‌కు గురయ్యారు. హరిద్వార్ రైల్వేస్టేషన్‌తో పాటు డెహ్రాడూన్, లక్సర్, రూర్కీ, కత్గోడం, నజీబాబాద్, షాహ్గంజ్ సహా పలు స్టేషన్లకు లేఖలో బాంబు బెదిరింపులు వచ్చాయి. లేఖ పంపిన వ్యక్తి తనను తాను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఏరియా కమాండర్‌గా పేర్కొన్నాడు. హిందీలో రాసిన లేఖలో అక్టోబర్ 25న స్టేషన్లను పేల్చివేస్తామని లేఖలో పేర్కొన్నారు.
అలాగే 27న ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్తో పాటు ఇతర మతపరమైన ప్రదేశాలపై బాంబు పేలుళ్లు జరుగుతాయని లేఖలో సదరు వ్యక్తి హెచ్చరించాడు. బెదిరింపు లేఖ నేపథ్యంలో అజ్ఞాత వ్యక్తులపై పోలీసులు యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జీపీఆర్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అరుణ భారతి తెలిపారు. కేసు నమోదు చేయడంతో పాటు ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, స్టేషన్లో భద్రతను పూర్తిస్థాయిలో పటిష్టం చేశామని, అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా వేసినట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

