Chandigarh Mayor | చండీగఢ్ మేయర్ స్థానం బీజేపీ వశం.. కమలనాథుల కుట్రకు నిలువలేని ఆప్
Chandigarh Mayor | చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడు ముఖ్య పదవులను బీజేపీ మరోసారి దక్కించుకున్నది. కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన ఇద్దరు సభ్యులతో బీజేపీ బలం పెంచుకున్నది.
Chandigarh Mayor | చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ కుట్ర బయటపడింది. కాంగ్రెస్ సభ్యులను తమ పార్టీలో చేర్చుకుని బలం పెంచుకున్నది. 14 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా ఆప్ నిలబడినా.. బీజేపీ కుట్రకు చతికిలపడిపోయింది. దాంతో మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు బీజేపీ వశమయ్యాయి. కొత్త మేయర్‌గా అనూప్ గుప్తా గెలుపొందగా.. కాంగ్రెస్, అకాళీదళ్ సభ్యులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు ముఖ్య పదవులకు మంగళవారం ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్‌లో మొత్తం 29 మంది ఓటు వేయగా.. బీజేపీకి 15, ఆప్‌కు 14 ఓట్లు వచ్చాయి. కొత్త మేయర్‌గా బీజేపీ అభ్యర్థి అనూప్ గుప్తా ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జస్బీర్ లడ్డీని 1 ఓటుతో ఓడించారు. కాగా, కాంగ్రెస్, అకాలీదళ్ కౌన్సిలర్లు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. శిరోమణి అకాలీదళ్ కార్పొరేటర్ హర్దీప్ సింగ్ ఓటు వేయలేదు. 2016 నుంచి బీజేపీ మేయర్ పదవిని సొంతం చేసుకుంటూ వస్తున్నది. సరబ్జీత్ కౌర్ మేయర్‌గా ఉన్న సమయంలో డిప్యూటీ మేయర్‌గా సేవలందించిన అనూప్ గుప్తా.. గత ఎన్నికల్లో 11 వార్డు నుంచి కౌన్సలిలర్గా గెలుపొందారు.
సీనియర్ డిప్యూటీ మేయర్ పదవిని కూడా బీజేపీయే దక్కింది. ఈ ఎన్నికలో మొత్తం 29 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి కన్వర్జిత్ రాణాకు 15 ఓట్లు. ఆప్ అభ్యర్థి తరుణ మెహతాకు 14 ఓట్లు వచ్చాయి. డిప్యూటీ మేయర్ పదవికి ఆప్ అభ్యర్థి సుమన్ శర్మపై బీజేపీ అభ్యర్థి హర్జీత్ సింగ్ విజయం సాధించారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 14 వార్డుల్లో ఆప్ అభ్యర్థులు గెలవగా.. 12 వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. ఎనిమిది మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఒక వార్డు శిరోమణి అకాళీదళ్‌కు దక్కింది. కాగా, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు హర్‌ప్రీత్ కౌర్ బబ్లా, గుర్చరణ్జీత్ సింగ్ కాలా బీజేపీలో చేరారు. దాంతో బీజేపీ బలం 14 కు చేరింది. ఎంపీ కిరణ్ ఖేర్ ఓటు వేయడంతో బీజేపీ మూడు పదవులను దక్కించుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

