చదువు వ్యాపారం కాదు.. వరుణ్ గాంధీ ట్వీట్ వైరల్
Varun Gandhi | చదువు వ్యాపారం కాదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫీజు చెల్లించనందుకు పరీక్షలు రాసేందుకు అనుమతించకపోవడంతో విలపిస్తున్న ఓ బాలిక
న్యూఢిల్లీ : చదువు వ్యాపారం కాదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫీజు చెల్లించనందుకు పరీక్షలు రాసేందుకు అనుమతించకపోవడంతో విలపిస్తున్న ఓ బాలిక వీడియోను ఎంపీ ట్వీట్ చేశారు. ‘ఫీజు కట్టలేక అవమానాలు ఎదుర్కొన్న లక్షలాది మంది చిన్నారుల బాధను ఈ బిడ్డ కన్నీళ్లు తెలియజేస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేసిన ఆయన.. ‘ఆర్థిక పరిమితులు పిల్లల చదువులకు ఆటంకం కలిగించకుండా చూసుకోవడం ప్రతి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల నైతిక బాధ్యత’ అని గుర్తు చేశారు.
ప్రైవేటు విద్యా సంస్థలు మానవత్వాన్ని మరువొద్దని, చదువు వ్యాపారం కాదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ బారిన వీడియో ఉన్నావ్ జిల్లాలోని బంగార్మావు సమీపంలోని తోలాకు చెందింది. అయితే, ట్యూషన్ ఫీజు చెల్లించనందుకు సోమవారం జరిగిన పరీక్షకు విద్యార్థులను హాజరుకాకుండా గేట్ వద్దే నిలిపివేశారు. పరీక్ష రాయలేకపోయినందుకు విద్యార్థులు రోధించారు. ఫీజు తీసుకువస్తామని చెప్పినా స్కూల్ మేనేజ్మెంట్ వినకుండా తమను బయటకు వెళ్లగొట్టారని ఆరో తరగతి విద్యార్థిని అపూర్వసింగ్ తెలిపింది.
అయితే, జనం నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత పాఠశాల యాజమాన్యం దిగి వచ్చింది. పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పింది. అయితే, మిగతా విద్యార్థులు ఏం చదువుతున్నారు? ఎంత ఫీజు బకాయి ఉన్నది? అనే వివరాలు తెలియరాలేదు. సెప్టెంబర్ నుంచి కనీసం పది మంది విద్యార్థులు ట్యూషన్ ఫీజు కట్టలేకపోయారు. ఈ క్రమంలో పరీక్షలు రాయకుండా గేట్ వద్దనే ఆపడంతో ఏడుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఎంపీ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు.
इस बेटी के आंसू उन लाखों बच्चों की संयुक्त पीड़ा बता रहे हैं जिन्हें फीस न जमा होने के कारण उपहास झेलना पड़ता है।
आर्थिक तंगी बच्चों की शिक्षा में रोड़ा ना बने यह हर जिले के अधिकारियों व जनप्रतिनिधियों की नैतिक जिम्मेदारी है।
निजी संस्थान मानवता न भूलें, शिक्षा व्यापार नहीं है। pic.twitter.com/GZL9RwSICB
— Varun Gandhi (@varungandhi80) October 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

