Lok Sabha: లోక్‌సభలో చన్నీ వర్సెస్ బిట్టు.. సభ 30 నిమిషాలు వాయిదా
Lok Sabha: కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ చన్ని.. కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య.. లోక్‌సభలో వాగ్వాదం జరిగింది. మీ తాత బియాంత్ సింగ్ వీరమరణం పొందారని, కానీ నువ్వు కాంగ్రెస్‌లో చేరాక ఆయన చనిపోయినట్లు చరణ్ కామెంట్ చేశారు. దానికి మంత్రి బిట్టు కౌంటర్ ఇచ్చారు. ఆయన దేశం కోసం చనిపోయారని, కాంగ్రెస్ కోసం కాదన్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ(Lok Sabha)లో ఇవాళ ఇద్దరు పంజాబీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ చన్ని, కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్నీత్ బిట్టు … వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో సభకు 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న సమయంలో.. చరణ్‌జీత్ చన్ని మాట్లాడుతూ.. పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ వీరమరణం పొందినట్లు కేంద్ర మంత్రి బిట్టుపై సెటైర్ వేశారు. బిట్టూజీ .. మీ తాత అమరుడని, కానీ నువ్వు కాంగ్రెస్‌ను వీడినప్పుడు ఆయన చనిపోయినట్లు ఆరోపించారు. మాజీ సీఎం బియాంత్ సింగ్ మనువడే .. కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టు. కాంగ్రెస్ పార్టీని వీడిన బిట్టు.. ఇటీవల బీజేపీలో చేరారు.
చన్నీ చేసిన వ్యాఖ్యలతో వాగ్వాదం మొదలైంది. ఆ సమయంలో చన్నికి కౌంటర్ ఇచ్చారు మంత్రి బిట్టు. రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల సహాయ మంత్రిగా ఉన్న బిట్టూ మాట్లాడుతూ.. చన్నీతో పాటు కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. తన తాత బియాంత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు వదిలారని, కాంగ్రెస్ పార్టీ గురించి కాదు అని బిట్టు పేర్కొన్నారు. చన్నీ ఓ అవినీతిపరుడు అని ఆరోపించారు. చన్ని అవినీతిపరుడని, రాష్ట్రంలోనే ఆయన ఇప్పుడు సంపన్న వ్యక్తి అని, వేలకోట్లు అతనికి ఎలా వచ్చాయో ఆశ్చర్యం వేస్తుందని బిట్టు ఆరోపించారు.
ఇద్దరు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. చైర్లో ఉన్న బీజేపీ సభ్యురాలు సంధ్యా రాణి సభ కార్యక్రమాలను అరగంట పాటు వాయిదా వేశారు.
Ravneet Bittu ne Channi ki keh ke leli 😂🔥 pic.twitter.com/ritLZ1i2OI
— BALA (@erbmjha) July 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

