NEET Row | నిందితులపై చర్యలు చేపడుతున్నాం : రవిశంకర్ ప్రసాద్
NEET Row : నీట్ వివాదంపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాము మౌనం దాల్చలేదని, చర్యలు తీసుకుంటున్నామని, నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు.
NEET Row : నీట్ వివాదంపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాము మౌనం దాల్చలేదని, చర్యలు తీసుకుంటున్నామని, నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పట్నాలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ మాదిరిగా తాము మాటలకే పరిమతం కాదని పేర్కొన్నారు. తాము మాటలకు పరిమితం కాకుండా కార్యాచరణ చేపడతామని చెప్పారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించిన 50 ఏండ్ల తర్వాత కూడా కాంగ్రెస్ తన తప్పిదానికి క్షమాపణలు చెప్పడం లేదని దుయ్యబట్టారు. ఇక అంతకుముందు నీట్ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. నీట్ రగడపై పార్లమెంట్ వేదికగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఈ ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఏం చేస్తుందనే విషయంపై తమ డిమాండ్లను లోక్‌సభ, రాజ్యసభ ముందుంచుతామని చెప్పారు.
అన్ని పరీక్షలను ఎన్టీఏ ప్రైవేట్ కంపెనీల ద్వారా నిర్వహిస్తోంది, స్కామ్‌లు ఎక్కడ నుంచి వెలుగుచూస్తున్నాయో గమనించాలని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల నుంచే ఈ స్కామ్‌లు బయటపడుతున్నాయని వివరించారు. ఈ వ్యవహారంపై చర్చ జరగాలని తాము పట్టుబడతామన్నారు. విద్యాశాఖ మంత్రి తొలుత పరీక్షల్లో అక్రమాలు లేవని అన్నారని, ఆపై చిన్నపాటి తప్పులు చోటుచేసుకున్నాయని చెప్పారని గుర్తుచేశారు.
ఇప్పుడు సీబీఐ విచారణ, ఉన్నతస్ధాయి కమిటీ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు. నీట్ వివాదం, ప్రశ్నాపత్రాల లీకేజ్, నీట్-యూజీ పరీక్ష రద్దు వంటి అంశాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ విషయంలోనే కాకుండా నెట్, యూజీ, ఎన్సీఈఆర్టీకి సంబంధించి అంశాలున్నాయని చెప్పారు. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే వ్యవస్ధలన్నీ ఈ వ్యవహారాలతో ముడిపడిఉన్నాయని పేర్కొన్నారు. ఎన్టీఏ సైతం విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.
Read More :
Bridge Collapses | నిన్న బిహార్‌లో.. నేడు జార్ఖండ్‌లో కూలిన వంతెన..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

