పోలీసులకు లంచం కోసం కుమార్తెల అమ్మకం!
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సొంత సర్కారు మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని తన దత్తత గ్రామాల్లో పోలీసులకు లంచం ఇచ్చేందుకు గ్రామస్తులు తమ కూతుళ్లను అమ్ముకుంటున్నారని తెలిపారు
- మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
- సొంత సర్కారుపై బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు
- బేటీ పఢావో-బేటీ బచావో ఇదేనా?
- అంటూ ప్రతిపక్షాల మండిపాటు
భోపాల్, సెప్టెంబర్ 20: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సొంత సర్కారు మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని తన దత్తత గ్రామాల్లో పోలీసులకు లంచం ఇచ్చేందుకు గ్రామస్తులు తమ కూతుళ్లను అమ్ముకుంటున్నారని తెలిపారు. మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడుతూ, తాను దత్తత తీసుకున్న గ్రామాల్లోని ప్రజలకు జీవనోపాధికోసం ఎలాంటి వనరులు లేవన్నారు. అందుకే వారంతా నాటుసారా కాస్తారని, దాన్ని అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.
వారిని తరుచూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, తమ కూతుళ్లను అమ్ముకొని లంచం ఇచ్చి బయటకొస్తున్నారని ప్రజ్ఞా ఠాకూర్ పేర్కొన్నారు. ఆమె మాట్లాడిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సమాధానం చెప్పాలని శివరాజ్సింగ్ చౌహాన్ సర్కారును ప్రతిపక్ష కాంగ్రెస్ నిలదీసింది. ‘బేటీ పఢావో-బేటీ బచావో’ అంటే ఇదేనా? అని ప్రశ్నించింది. సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ఈ అంశాన్ని పార్లమెంట్లో ఎందుకు లేవనెత్తలేదని కాంగ్రెస్ నాయకురాలు సంగీతశర్మ ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

