Nishikant Dubey | నెహ్రూ, ఇందిర అమెరికాకు ఆ పర్మిషన్ ఇచ్చారు.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Nishikant Dubey | మాజీ ప్రధాన మంత్రులు (Ex PMs) జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru), ఇందిరాగాంధీ (Indira Gandhi) లపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) సంచలన ఆరోపణలు చేశారు.
Nishikant Dubey : మాజీ ప్రధాన మంత్రులు (Ex PMs) జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru), ఇందిరాగాంధీ (Indira Gandhi) లపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరు ప్రధానులు భారత్‌లోని ఒక పర్వతంపై నిఘా పరికరం అమర్చేందుకు అమెరికా (USA) కు అనుమతిచ్చారని ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ (సోమవారం) ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్టుపెట్టారు.
చైనా కార్యకలాపాలపై నిఘా కోసం మన దేశంలో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నేతృత్వంలో కోవర్ట్ ఆపరేషన్ దశలవారీగా జరిగిందని, నెహ్రూ హయాంలో తొలిసారి అణు ఆధారిత నిఘా పరికరాన్ని నందాదేవీ పర్వత శిఖరాన (ఉత్తరాఖండ్‌లోని) అమర్చేందుకు అనుమతించారని దూబే తన పోస్టులో పేర్కొన్నారు. తర్వాత ఇందిరాగాంధీ హయాంలోనూ అందుకు అనుమతి లభించిందని ఆరోపించారు.
ఆ తర్వాత అగ్రరాజ్యం నందాదేవి నుంచి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుందని దూబే తెలిపారు. పర్యావరణపరంగా సున్నితమైన హిమాలయన్ ప్రాంతంలో ఆ ప్రమాదకర పరికరాన్ని వదిలేసి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తున్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇది కారణం కాదా..? అని ప్రశ్నించారు. హిమానీనదాలు కరగడానికి, క్లౌడ్‌బరస్ట్, ఇళ్లల్లో పగుళ్లకు కూడా ఇదే కారణమా..? అని అనుమానం వ్యక్తంచేశారు.
పార్లమెంట్లో 1978లో నిఘా పరికరం విషయాన్ని అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అంగీకరించారని దూబే పేర్కొన్నారు. అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఇటీవల దీనిపై కథనాన్ని ప్రచురించిందని తెలిపారు. ఇప్పుడు మన భావితరాలను కాపాడుకునే సమయం ఆసన్నమైందని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ అంశంపై 1978లో అమెరికా చట్టసభ సభ్యులు తమ ప్రభుత్వానికి రాసిన లేఖను ఆయన షేర్ చేశారు.
కొన్ని నెలల క్రితం కూడా దూబే ఈ విషయంపై కాంగ్రెస్‌ను విమర్శించారు. నందాదేవీ పర్వతంపై కనిపించకుండా పోయిన అమెరికా అణు పరికరానికి, ఉత్తర భారతంలో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు ముడిపెడుతూ ఆయన విమర్శలు చేశారు. నెహ్రూ, ఇందిరతోపాటు రాహుల్ గాంధీ విదేశీ శక్తులకు లొంగిపోయి, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని మండిపడ్డారు. వారి చర్యలు భావితరాలకు ప్రమాదకరంగా మారాయని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

