Rahul Gandhi | పార్లమెంట్ వేదికగా రాహుల్ అసత్య ప్రచారం : మనోజ్ తివారీ
Rahul Gandhi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమవారం జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు.
Rahul Gandhi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమవారం జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు. రాహుల్ తన తొలి ప్రసంగంలోనే మోదీ సర్కార్పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు.
ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ తాజాగా వెల్లడించింది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హిందువులు, ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తొలగించినట్లు వివరించింది. ఇక రాహుల్ వ్యాఖ్యలపై పాలక పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా తప్పుడు సమాచారం అందించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మండిపడ్డారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పార్లమెంట్ వేదిక కారాదని అన్నారు. లోక్సభలో నిన్న రాహుల్ అసత్యాలు వల్లెవేశారని, ఆ సమయంలో సంబంధిత మంత్రులు ఆ విషయం బయటపెట్టారని మనోజ్ తివారీ పేర్కొన్నారు. సభా వేదికపై అసత్యాలు మాట్లాడితే వాటిని రికార్డుల నుంచి తొలగించడం సభా సంప్రదాయాల్లో భాగమని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పష్టం చేశారు.
Read More :
Drinking Water | హైదరాబాద్లో మరోసారి నీళ్లు బంద్.. ఎప్పుడు.. ఏయే ప్రాంతాల్లో అంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

