గుజరాత్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా నీమాబెన్ ఆచార్య!
MLA Nimaben Acharya | గుజరాత్లో ఇటీవల కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా మంత్రివర్గం కూడా కొలువుదీరింది. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.

అహ్మదాబాద్ : గుజరాత్లో ఇటీవల కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా మంత్రివర్గం కూడా కొలువుదీరింది. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. దీంతో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు తొలిసారిగా ఓ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎమ్మెల్యే నీమాబెన్ ఆచార్యను అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే గుజరాత్ అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్‌గా నీమాబెన్ నిలిచిపోనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సెక్రటేరియట్ నామినేషన్లను ఆహ్వానించింది. దీంతో నీమాబెన్ ఆచార్య.. మంత్రి త్రివేది, చీఫ్‌విప్ పంకజ్ దేశాయ్‌తో కలిసి నామినేషన్ పేపర్లను సమర్పించారు.
బీజేపీ ఎమ్మెల్యే నీమాబెన్ ఆచార్యకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. సెప్టెంబర్ 16వ తేదీన స్పీకర్ పోస్టుకు రాజేంద్ర త్రివేది రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో ఆ పోస్టు ఖాళీ అయింది. రాజేంద్ర త్రివేది సీఎం భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో చేరారు. త్రివేది రెవెన్యూ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Semaglutide | సన్ ఫార్మాకు కీలక అనుమతి.. ఇక సెమాగ్లుటైడ్ ఔషధం ట్యాబ్లెట్ల రూపంలో..
Suryapet | సూర్యాపేటలో రెండు బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Pawan Kalyan | విడాకులకు రెండు వారాల ముందే హింట్ ఇచ్చిన అన్నా కొణిదెల.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ వెనుక అసలు కారణం ఇదేనా?
IND vs NZ | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం..!
Ramayana OTT | ఓటీటీలో ‘రామాయణ’ రెండు వెర్షన్లు వస్తాయా ..సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

