Currency Notes In File | అసెంబ్లీ జరుగుతుండగా ఫైల్లో డబ్బులు ఉంచిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌పై వివరణ
Currency Notes In File | అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఒక ఫైల్లో డబ్బులు ఉంచారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు రావడంతో ఆమె వివరణ ఇచ్చారు.
ముంబై: అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఒక ఫైల్లో డబ్బులు ఉంచారు. (Currency Notes In File) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు రావడంతో ఆమె వివరణ ఇచ్చారు. అపార్థాలకు తావివ్వ కూడదని మీడియాను కోరారు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం విధానసభలో ఒక సభ్యుడు మాట్లాడుతుండగా జింటూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మేఘనా సాకోరే బోర్దికర్ ఒక ఫైల్లో రెండు రూ.500 నోట్లు ఉంచారు. ఒక వ్యక్తికి ఆ ఫైల్‌ను అందజేశారు.
కాగా, శరద్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన నేత మహదేవ్ బాల్గుడే ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘కొద్ది నిమిషాల కిందట జరిగిన వీడియోను నిశితంగా పరిశీలించండి. అసెంబ్లీ హాలులో బెంచీపై కూర్చున్న మహిళా ఎమ్మెల్యే కరెన్సీ నోట్లను ఫైల్లో ఉంచుతూ కనిపించారు. ఇక్కడ ఏమి జరుగుతోంది?’ అని ప్రశ్నించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే మేఘన దీని గురించి ఎక్స్‌లో వివరణ ఇచ్చారు. ‘ఉదయం నుంచి జ్వరంగా ఉంది. మందుల కోసం ఫోల్డర్లో రూ.1000 ఉంచి నా పీఏకు ఇచ్చా. ఆ ఫోల్డర్‌ను విధానసభలోని ఒక ప్యూన్ ద్వారా బయట ఉన్న నా పీఏకు పంపించా. అపార్థాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ వీడియో క్లిప్‌ను వైరల్ చేశారు’ అని అందులో పేర్కొన్నారు. తన వివరణ కూడా ప్రజలకు చేరేలా చూడాలని మీడియాను ఆమె కోరారు.
व्हिडीओ बारकाईने बघा जो अगदी काही मिनिटांपूर्वीचा आहे. सभागृहात बाकावर बसलेल्या महिला आमदार फाईलमध्ये पैशांच्या नोटा ठेवताना दिसत आहेत. नेमका हा काय प्रकार आहे? pic.twitter.com/B39yaLClfU
— Mahadev Balgude (@Mahadev_Balgude) July 12, 2024
सकाळपासून सर्दी आणि कणकण वाटत असल्याने एका फोल्डरमध्ये औषधी आणण्यासाठी 1000 रुपये माझ्या PA कडे देण्यासाठी ठेवले होते. ते फोल्डर विधानसभेतील शिपायामार्फत माझ्या PA कडे सभागृहाबाहेर पाठविण्यासाठी दिले गेले.
मात्र नेमका त्याचा व्हिडिओ काढून तो व्हायरल करण्याचा आणि त्यातून गैरसमज…— Meghna Sakore Bordikar (@MeghnaBordikar) July 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

