Karnataka Elections | ముస్లింలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Elections) ముంచుకొస్తుండటంతో బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమ నోటికి పనిచెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టే కుయుక్తులకు తెరలేపారు.
బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Elections) ముంచుకొస్తుండటంతో బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమ నోటికి పనిచెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టే కుయుక్తులకు తెరలేపారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసనగుడ పాటిల్ ముస్లింలను టిప్పు సుల్తాన్‌తో పోల్చారు. ముస్లిం నేతలకు ప్రజలు ఓటు వేయరాదని కోరారు. మీ నియోజకవర్గంలో లక్ష మంది టిప్పు సుల్తాన్లు ఉండగా శివాజీ మహరాజ్ సంతతికి చెందిన మీరు బీజాపూర్ నుంచి ఎలా గెలుస్తారని ఎమ్మెల్యేలంందరూ తనను అడుగుతున్నారని చెప్పారు.
బీజాపూర్‌లో టిప్పు సుల్తాన్ అనుచరులెవరూ గెలవరని, శివాజీ సంతతికి చెందిన వారే విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు. మీరు పొరపాటున కూడా ముస్లింలకు ఓటు వేయవద్దని ఆయన కోరారు. ముస్లింలపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ తరహా చిత్రీకరణలు అసంబద్ధమని పేర్కొంది. కన్నడిగులుగా మనం ప్రగతిశీల రాజకీయాలను కోరుకోవాలని మీరు అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ప్రజలను ఓట్లు అడగాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే కోరారు.
Read More :
Stray Dog Kills Infant | రాజస్థాన్‌లో దారుణం.. ఆస్పత్రిలో తల్లి పక్కలోంచి పసికందును ఎత్తుకెళ్లి చంపిన వీధి కుక్క
heatwave | భానుడి భగభగ : ప్రజలకు ఐఎండీ వార్నింగ్
Manish Sisodia- Satyendar Jain | మంత్రి పదవులకు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా.. ఆమోదించిన కేజ్రీవాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

