రాజస్థాన్‌లో ల్యాండ్ జిహాద్.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణ

జైపూర్: రాజస్థాన్‌లో ముస్లింలు ల్యాండ్ జిహాదీకి పాల్పడుతున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే కన్హయ్య లాల్ ఆరోపించారు. మాల్పురా నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే.. అసెంబ్లీలో మాట్లాడుతూ ముస్లింలు స్థానిక హిందువుల భూముల్ని లాగేసుకుంటున్నట్లు తెలిపారు. మాల్పురా పట్టణం చాలా సున్నితమైందని, ఇక్కడ 1950 నుంచి ఎప్పుడూ మత ఘర్షణలే జరుగుతున్నాయని, ఆ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు వందలాది మంది హిందువులు మరణించినట్లు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో ఉండే ముస్లిం వర్గీయులు ఓ ప్రణాళిక ప్రకారం హిందువులపై దాడి చేస్తున్నారని, హిందువులకు చెందిన భూములు, ఇండ్లను తక్కువ ధరకు ఖరీదు చేసి, అక్కడ అక్రమంగా జీవించడం మొదలు పెడుతున్నారని, ఆ తర్వాత అక్కడ పొరుగున ఉండే హిందు ఫ్యామిలీలతో తరుచూ గొడవలకు దిగుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
హిందూ కూతుళ్లు, సోదరీమణులను ముస్లింలు వేధిస్తున్నట్లు కూడా ఎమ్మెల్యే తన అసెంబ్లీ ప్రసంగంలో తెలిపారు. అభ్యంతరకరమైన రీతిలో సంకేతాలు ఇస్తున్నారని, సంభాషణలు కూడా చేస్తుంటారని అన్నారు. దీంతో అక్కడ ఉన్న హిందువులు అభద్రతాభావంలోకి వెళ్లిపోయినట్లు ఆయన చెప్పారు. ఆ కారణంగానే బస్తీల్లో ఉన్న సుమారు 800 హిందూ కుటుంబాలు వలస వెళ్లినట్లు తెలిపారు. 9 వార్డులకు చెందిన హిందువులు వలస బాటపట్టినట్లు ఆయన ఆరోపించారు. జైన మందిరాలు ఉన్న చోట .. ముస్లింలు తినేసి ఎముకల్ని వదిలి వెళ్తున్నారని కూడా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

