బీజేపీకి ఆ డబ్బు ఎక్కడిది?
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లలో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది. ‘మా బ్యాంకు లాకర్లను సీబీఐ 2 గంటల పాటు సోదా చేసింది. అయితే వారికి ఏమీ దొరకలేదు
- ఆపరేషన్ కమలంపై సీబీఐ దర్యాప్తు ఎప్పుడు?
- బీజేపీని ప్రశ్నించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా
- బీజేపీ బచ్చా చోర్ పార్టీ అంటూ మండిపాటు
- హజారేను వాడుకుంటున్న బీజేపీ: కేజ్రీవాల్ విమర్శ
ఘజియాబాద్, ఆగస్టు 30: ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లలో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది. ‘మా బ్యాంకు లాకర్లను సీబీఐ 2 గంటల పాటు సోదా చేసింది. అయితే వారికి ఏమీ దొరకలేదు. 70 వేల విలువైన వస్తువులు, మా కొడుకు బొమ్మ మాత్రమే దొరికాయి’ అని సిసోడియా పేర్కొన్నారు.
సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. సోదాల అనంతరం ఢిల్లీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఆపరేషన్ కమలం కోసం బీజేపీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై సీబీఐ దర్యాప్తు ఎప్పుడో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ప్రశ్నించారు. అలాగే నోట్ల రద్దు సమయంలో ఎల్జీ సక్సేనా 1400 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు ఎప్పుడో చెప్పాలని డిమాండ్‌చేశారు. పెరుగు, పాలు, లస్సీ, తేనె వంటి తినే పదార్థాలపై వసూలు చేసిన జీఎస్టీని బీజేపీ తన ధనిక స్నేహితుల రుణాలు మాఫీ చేసేందుకు వాడుకుంటున్నదని ఆరోపించారు. ఇటీవల ఓ పసికందును బీజేపీ కార్పొరేటర్ కొనుగోలు చేసిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని బీజేపీని ‘బచ్చా చోర్’ పార్టీ అంటూ దుయ్యబట్టారు.
అన్నా హజారేను వాడుకుంటున్న బీజేపీ
ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ అన్నా హజారే లేఖ రాయడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియా లాకర్లలో సీబీఐకి ఏమీ దొరక్కపోవడంతో బీజేపీ నిరాశ తో సామాజిక కార్యకర్త అన్నా హజారేను వాడుకుంటున్నదని దుయ్యబట్టారు. అయినా కూడా రాజకీయ కారణాలతో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

