త్రిముఖ పోరులో మెట్రోమ్యాన్

- పాలక్కడ్ బరిలో శ్రీధరన్
- ఎల్డీఎఫ్, యూడీఎఫ్ గట్టి పోటీ
పాలక్కడ్, మార్చి 5: దాదాపు తొమ్మిది పదుల వయస్సున్న అభ్యర్థి ఓ వైపు.. హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థి మరోవైపు, ఎన్నికల్లో మొదటిసారి తన అదృష్టం పరీక్షించుకొంటున్న యువ నేత ఇంకోవైపు.. మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ అభ్యర్థిత్వంలో దేశం చూపును తనవైపును తిప్పుకొన్న పాలక్కడ్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇది. పాలక్కడ్ సిటీని ఐదేండ్లలో దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానని శ్రీధరన్ తన ప్రచారంలో చెప్తున్నారు. రాజకీయాలు తక్కువగా, అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడతానంటూనే ఇంటింటికి తిరిగి ఓట్ల వేట సాగిస్తున్నారు. 88 ఏండ్ల వయస్సున్న ఆయన సాధారణ రాజకీయ నేతలా ప్రజలకు చేరువ కాలేడన్న విమర్శకులు సైతం ఆయన ప్రచార శైలిని చూసి ఆశ్చర్యపోతున్నారు. శ్రీధరన్‌తో తమ పార్టీ కేరళలో బలపడుతుందని బీజేపీ గట్టిగా భావిస్తున్నది. త్రిముఖ పోరులో మరో నేత 38 ఏండ్ల షఫీ పరంబీర్. కాంగ్రెస్ అభ్యర్థి. గతంలో రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు. ప్రజలకు తనపై విశ్వాసం ఉందని పరంబీల్ నమ్ముతున్నారు. ఇక అధికార ఎల్డీఎఫ్ నుంచి ప్రమోద్ బరిలో ఉన్నారు. విజయన్ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రచారాస్త్రంగా చేసుకొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి ఎంబీ రాజేశ్‌కు 32.83 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు తమకే వస్తాయని ఎల్డీఎఫ్ అంచనా వేస్తున్నది. ఏప్రిల్ 6న కేరళలో ఎన్నికలు జరుగుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

