బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ నటించిన సినిమాలు, ప్రకటనలను ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు నిషేధం విధించాలని బీజేపీ కర్ణాటక శాఖ ఎన్నికల కమిషన్‌ను కోరింది. శివరాజ్ భార్య గీత కాంగ్రెస్ అభ్యర్థిగా శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. శివరాజ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లను విచక్షణారహితంగా తొలగించడంపై చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ కోరింది.