Ants | ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే.. ఈ సహజసిద్ధమైన చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి..
ఇంట్లోకి చీమలు రావడం చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ముఖ్యంగా వంటగదిలో ఆహారం, తీపి పదార్థాలు, కిందపడిన ఆహార పదార్థాల వాసనకు చీమలు త్వరగా ఆకర్షితమవుతాయి. అయితే ఆహారం మాత్రమే కాదు.. తేమ కూడా చీమలను ఇంట్లోకి రప్పిస్తుంది.
Ants | ఇంట్లోకి చీమలు రావడం చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ముఖ్యంగా వంటగదిలో ఆహారం, తీపి పదార్థాలు, కిందపడిన ఆహార పదార్థాల వాసనకు చీమలు త్వరగా ఆకర్షితమవుతాయి. అయితే ఆహారం మాత్రమే కాదు.. తేమ కూడా చీమలను ఇంట్లోకి రప్పిస్తుంది. అందుకే వంటగది సింక్లు, బాత్రూమ్లు, అల్మారాలు, వార్డ్రోబ్లలోని దుస్తుల దగ్గర కూడా చీమలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు చీమలను కదిలించినప్పుడు అవి కుట్టే అవకాశం కూడా ఉంటుంది. చీమలు విడుదల చేసే ఫార్మిక్ యాసిడ్ కారణంగా చర్మంపై స్వల్ప మంట, చికాకు, ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇంట్లో ఒక్కసారిగా చీమలు ఎక్కువగా కనిపిస్తే, వాటిని దూరంగా ఉంచేందుకు వంటగదిలో సాధారణంగా లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించవచ్చు.
తడి నేల ఉంటే..
చీమలు ఇంట్లోకి రావడానికి ప్రధాన కారణాల్లో పరిశుభ్రత లేకపోవడం ఒకటి. నేలపై పడిన ఆహారపు ముక్కలు, చిందిన పదార్థాలు, ఇతర ఆహార అవశేషాలను సరిగా శుభ్రం చేయకపోతే చీమలు వాటికి ఆకర్షితమవుతాయి. ముఖ్యంగా వంటగదిలో ఆహారాన్ని మూత లేకుండా ఉంచడం, తీపి పదార్థాలను బయట ఉంచడం వల్ల చీమలు సులభంగా అక్కడికి చేరుతాయి. నీటి కోసం కూడా చీమలు ఇంట్లోకి వస్తుంటాయి. తడిగా ఉండే ప్రదేశాలు, వంటగది సింక్లు, బాత్రూమ్లు, లీక్ అవుతున్న నల్లాల దగ్గర ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే తీవ్రమైన ఎండ, భారీ వర్షాలు లేదా చలి సమయంలో బయట వాతావరణం నుంచి రక్షణ కోసం చీమలు ఇంట్లోకి చేరి గూడు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
వెనిగర్ మిశ్రమం..
చీమలు ఆహారం లేదా నీటి మార్గాన్ని గుర్తించేందుకు ఫెరోమోన్ అనే రసాయన సంకేతాల ఆధారంగా ఏర్పడే వాసన మార్గాలను ఉపయోగిస్తాయి. ఘాటైన వాసన కలిగిన కొన్ని పదార్థాలు ఈ మార్గాలను అంతరాయం కలిగిస్తాయి. దీంతో చీమలకు ఆహారం లేదా నీటి దారి గుర్తించడం కష్టమవుతుంది. ఇంట్లో చీమలు కనిపించే ప్రదేశాల్లో వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. సమాన పరిమాణంలో వైట్ వెనిగర్, నీటిని కలిపి స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంటగది కౌంటర్లు, కిటికీలు, తలుపుల ఫ్రేమ్‌లు, చీమలు లోపలికి వచ్చే మార్గాల్లో స్ప్రే చేయవచ్చు. నేలను తుడిచే నీటిలో కొద్దిగా వెనిగర్ కలపడం వల్ల కూడా చీమలను దూరంగా ఉంచవచ్చు. బిర్యానీ ఆకులు లేదా బే లీవ్స్‌ను కూడా చీమలను దూరంగా ఉంచేందుకు ఉపయోగించవచ్చు. వీటి ఘాటైన వాసన చీమలకు నచ్చదు. కొన్ని బే లీవ్స్‌ను స్వల్పంగా నలిపి చీమలు కనిపించే ప్రాంతాల్లో, తలుపులు లేదా కిటికీల దగ్గర అలాగే చక్కెర డబ్బాలు, తీపి పదార్థాలు ఉంచే ప్రదేశాల దగ్గర పెట్టాలి. ఇలా చేయడం వల్ల చీమలు ఆహార పదార్థాలకు దూరంగా ఉంటాయి.
పసుపు..
పసుపు కూడా ఇంట్లో చీమలను నివారించేందుకు ఉపయోగించే మరో సాధారణ వంటింటి పదార్థం. పసుపు వాసన చీమలను నిరుత్సాహపరుస్తుంది. చీమలు ఇంట్లోకి ప్రవేశించే తలుపులు, కిటికీలు లేదా ఇతర ప్రదేశాల దగ్గర పసుపు పొడితో పలుచని గీతలా చల్లాలి. ఎర్ర మిరపకాయ, ఉప్పుతో తయారు చేసిన స్ప్రేను కూడా మనం ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒకటి నుంచి రెండు గ్లాసుల నీటిలో ఒక చెంచా ఉప్పు, ఒకటి నుంచి రెండు చెంచాల ఎర్ర మిరప పొడి వేసి మరిగించాలి. ఆ మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యాక పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం వడకట్టి స్ప్రే బాటిల్లో పోసుకుని చీమలు కనిపించే మూలలు, కిటికీల దగ్గర, గోడల అంచుల్లో స్ప్రే చేయాలి.
నిమ్మరసం..
నిమ్మరసం కూడా చీమల వాసన మార్గాలకు అంతరాయం కలిగిస్తుంది. ఇంట్లోకి చీమలు ప్రవేశించే ప్రదేశాలు, కిటికీలు, వంటగది ఉపరితలాల చుట్టూ తాజా నిమ్మరసాన్ని స్ప్రే చేయాలి. ఉపయోగించిన నిమ్మ తొక్కలను తలుపుల దగ్గర లేదా కిటికీల అంచుల వద్ద ఉంచడం ద్వారా కూడా చీమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. చీమలను నివారించేందుకు ఈ వంటింటి చిట్కాలు ఉపయోగపడతాయి. అయితే వీటితోపాటు ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా, పొడిగా ఉంచడం చాలా ముఖ్యం. ఆహార పదార్థాలకు మూతపెట్టి ఉంచడం, కింద పడిన లేదా చిందిన ఆహారాన్ని వెంటనే శుభ్రం చేయడం, నీరు లీక్ అయ్యే ప్రదేశాలను సరిచేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంట్లోకి చీమలు వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

