బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేం
మిత్రపక్షం జేడీయూకి కేంద్రంలోని అధికార బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రతిపాదనలు, ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేసింది.
- ఆ ప్రతిపాదనేమీ లేదన్న కేంద్రం
- మిత్రపక్ష జేడీయూకు గట్టి షాక్
- నితీశ్ రాజీనామాచేయాలి
- ప్రతిపక్ష ఆర్జేడీ డిమాండ్
న్యూఢిల్లీ: మిత్రపక్షం జేడీయూకి కేంద్రంలోని అధికార బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రతిపాదనలు, ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేసింది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్, ఇతర వెనుకబడిన రాష్ర్టాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రణాళిక ఏమైనా ఉందా? అని జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్రం స్పందనపై ఆర్జేడీ మండిపడింది. జేడీయూను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది. ‘కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యమైన నితీశ్ కుమార్, ఇతర జేడీయూ నేతలు.. ఆ ఫలితాలను అనుభవించండి. బీహార్‌కు ప్రత్యేక హోదాపై వారి డ్రామా రాజకీయాలు కొనసాగించాలి’ అర్జేడీ ఎక్స్ పోస్టులో ఎద్దేవా చేసింది. సీఎం నితీశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- BJP
- JDU
- Pankaj Chaudhary
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

