Maharastra | ఐదో తేదీన మహా కొత్త సర్కార్ ప్రమాణ స్వీకారం..!
Maharastra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం డిసెంబర్ ఐదో తేదీన కొలువు దీరనున్నది.
Maharastra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం డిసెంబర్ ఐదో తేదీన కొలువు దీరనున్నది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయం వెల్లడించకున్నా.. ముంబైలోని ఐకానిక్ అజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర కొత్త సీఎంతో కూడిన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నది. ఈ సంగతి బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే శనివారం ప్రకటించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో బీజేపీ 132, ఏక్ నాథ్ షిండే సారధ్యంలోని శివసేన 57, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. మహా యుతి కూటమి 230 స్థానాలు గెలుచుకున్నది.
బీజేపీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కేవలం 16 సీట్లకు పరిమితం కాగా, ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన 20, శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 సీట్లకు పరిమితం అయ్యాయి. విపక్ష మహా వికాస్ అఘాదీ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. తదుపరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయమై ఢిల్లీలో బీజేపీ కేంద్ర నాయకత్వంతోనూ, తర్వాత ముంబైలోనూ మహాయుతి మిత్రపక్షాల నేతలు చర్చించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

