బెంగళూరులో రోడ్డుపై పెద్ద గుంత.. అందులోపడి బైకర్‌కు గాయాలు
ఉన్నట్టుండి రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. దీంతో అదుపుతప్పిన వ్యక్తి అందులో పడటంతో గాయపడ్డాడు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి అందులోపడి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ రోడ్డు మార్గాన్ని మూసివేశారు. సెంట్రల్ బెంగళూరులోని షోలే సర్కిల్లో ఈ సంఘటన జరిగింది. మెట్రో రెండో దశ నిర్మాణం జరుగుతున్న రూజ్ బ్రిగేడ్ రోడ్‌పై గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఒక వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. అయితే ఉన్నట్టుండి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో అదుపుతప్పిన వ్యక్తి అందులో పడటంతో గాయపడ్డాడు. ఆ వ్యక్తిని పునీత్‌గా గుర్తించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఆ మార్గాన్ని అధికారులు మూసివేశారు. సిబ్బందిని వెంటనే అక్కడకు రప్పించి రోడ్డుపై ఏర్పడిన గంతను పూడ్చే పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక వైపు మార్గంలోని రోడ్డును బారికేడ్లతో మూసివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మరోవైపు మంగళవారం లోహిత్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి బైక్‌పై వెళ్తుండగా నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ వారిపై కూలింది. ఈ ప్రమాదంలో భార్య, కుమారుడు మరణించారు. లోహిత్, అతడి కుమార్తె గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన కూతవేటు దూరంలోనే గురువారం రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అందులో పడ్డాడు. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- biker
- Injured
- road caves
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

