Watch: వర్షంతో తడిసిన రోడ్డుపై జారిన బైకర్.. లారీ ఢీ నుంచి ఎలా బయటపడ్డాడంటే!
Viral Video | బైక్ జారడంతో దానిని నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. వెనుక వాహనాలు వస్తుండటాన్ని గమనించిన వెంటనే అతడు వేగంగా పక్కకు పరుగెత్తాడు. ఇంతలో ఒక లారీ వేగంగా అతడి బైక్ మీదకు దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అది ఆగింది.
న్యూఢిల్లీ: రోడ్డుపై జరిగే ప్రమాదాల నుంచి కొందరు అనూహ్యంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. ఒక వ్యక్తి కూడా అలాగే ప్రాణాలు దక్కించుకున్నాడు. అతడు కొంత ఆలస్యం చేసి ఉంటే జరిగే దారుణం ఊహించుకోవడం కష్టం. జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో ఒక రోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఒక వ్యక్తి కూడా బైక్‌పై వేగంగా వెళ్లాడు. అయితే వర్షానికి ఆ రోడ్డు తడిసింది. దీంతో ఆ వ్యక్తి బైక్‌పై నియంత్రణ కోల్పోయాడు. ఆ బైక్ రోడ్డుపై జారింది. ఆ బైక్ వెనుకే ఒక లారీ కూడా వేగంగా వస్తున్నది.
కాగా, బైక్ జారడంతో దానిని నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. వెనుక వాహనాలు వస్తుండటాన్ని గమనించిన వెంటనే అతడు వేగంగా పక్కకు పరుగెత్తాడు. ఇంతలో ఒక లారీ వేగంగా అతడి బైక్ మీదకు దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అది ఆగింది. అయితే ఆ బైకర్ బైక్ జారిన చోట నుంచి కదలకుండా అక్కడే ఉండి ఉంటే ఆ లారీ కింద నలిగిపోయి ఉండేవాడు.
మరోవైపు ఆ రోడ్డుపై వెళ్తున్న మరో వాహనంలోని ఫ్రంట్ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయ్యింది. ‘హౌ డిడ్ యూ గెట్ అవుట్ అలైవ్’ అనే యూజర్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందించారు. ఈ వీడియో క్లిప్ చూసి షాక్ అయినట్లు కొందరు తెలిపారు. ఆ బైకర్ అదృష్టవంతుడని, ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడని కొందరు పేర్కొన్నారు. మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.
అయితే వాహనదారులను రోడ్డు ప్రమాదాల పట్ల ఈ వీడియో అప్రమత్తం చేస్తుందని కొందరు పేర్కొన్నారు. వర్షాకాలంలో రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మరికొందరు సూచించారు.
https://twitter.com/whatcouIdGwrong/status/1643901706693128197?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1643901706693128197%7Ctwgr%5E77fd5f4ba620941b29219046987b117d5485e811%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fviral-video-biker-falls-road-speeding-truck-behind-him-watch-how-he-saves-himself-5986554%2F
Also Read:
Delhi Lodge Murder Case | వ్యాపారి హత్య కేసులో హనీ ట్రాప్ కోణం.. ఒక మహిళ అరెస్ట్
Ajit Pawar | ‘ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి తీసుకున్నా’.. ఊహాగానాల వార్తలపై అజిత్ పవార్ స్పందన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

