ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిన మహిళ.. ప్రమాదవశాత్తూ మరణించినట్లు చిత్రీకరించే యత్నం
భర్త అడ్డు తొలగిపోతే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతోపాటు వచ్చే డబ్బుతో అప్పులు కూడా తీరిపోతాయని భార్య బీనా భావించింది. భర్త హత్య కోసం ఇద్దరు కాంట్రాక్ట్ హంతకులను సంప్రదించింది.
పాట్నా: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక మహిళ కాంట్రాక్ట్ హంతకుల సహాయంతో భర్తను హత్య చేసింది. ప్రమాదవశాత్తూ మరణించినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు గుట్టు రట్టయ్యింది. బీహార్‌లోని ముంగేర్‌లో ఈ సంఘటన జరిగింది. బీనా హంసదా అనే మహిళ భర్త అనూప్ తుడ్డు, జమాల్పూర్ రైల్వే వర్క్‌షాప్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెలలో అతడు రిటైర్ కానున్నాడు. మద్యానికి బానిస అయిన అతడు కుటుంబ ఖర్చుల కోసం ఇతరుల నుంచి చాలా అప్పులు చేశాడు.
కాగా, భర్త అడ్డు తొలగిపోతే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతోపాటు వచ్చే డబ్బుతో అప్పులు కూడా తీరిపోతాయని భార్య బీనా భావించింది. దీంతో భర్త హత్య కోసం ఇద్దరు కాంట్రాక్ట్ హంతకులను సంప్రదించి లక్షకు ఒప్పందం చేసుకుంది. అడ్వాన్స్‌గా రూ.25,000 ఇచ్చింది. జనవరి 1న తన బంధువులంటూ వారిద్దరినీ ఇంటికి రప్పించింది. వారితో కలిసి మద్యం సేవించిన అనూప్ మత్తుగా నిద్రపోయాడు. భార్య బీనా, కాంట్రాక్ట్ కిల్లర్స్ శశికాంత్ అలియాస్ సంజయ్ కుమార్, రంజిత్ అలియాస్ సంజయ్ యాదవ్ కలిసి గొంతునులిమి అనూప్‌ను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశారు.
మరోవైపు కాలువలో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడ్ని అనూప్‌గా గుర్తించారు. అతడి భార్యను ప్రశ్నించగా మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయి ఉంటాడంటూ పోలీసులకు చెప్పింది. అయితే మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా గొంతునులిమి చంపినట్లు తేలింది. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 21 రోజుల తర్వాత సాంకేతిక ఆధారాలతో అనూప్ హత్య కేసును ఛేదించారు. తొలుత ఒక కాంట్రక్ట్ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో కిల్లర్‌ను కూడా పట్టుకున్నారు. చివరకు హతుడి భార్య బీనా కూడా నిజం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

