Caste Census: కుల గణన చేపట్టాల్సిందే.. మోదీ వద్ద బీహారీల డిమాండ్

న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌లు ఇవాళ ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో కుల గణన ( Caste Census ) చేపట్టాలని వాళ్లు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సౌత్ బ్లాక్‌లో మోదీతో ఆ రాష్ట్రానికి చెందిన నేతలు భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయినవారిలో ముఖేశ్ సహాని, జితన్ రామ్ మాంజీలు కూడా ఉన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత బీహార్ సీఎం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కులాల వారిగా జనాభా లెక్కలు చేపట్టాలన్న డిమాండ్‌ను ప్రధాని ఆలకించినట్లు నితీశ్ తెలిపారు. ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన్ను కోరినట్లు చెప్పారు. కుల గణన అంశంపై రాష్ట్ర అసెంబ్లీ రెండు సార్లు తీర్మానాలు చేసినట్లు సీఎం నితీశ్ తెలిపారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా మీడియాతో మాట్లాడారు. కేవలం రాష్ట్రంలో మాత్రమే కాదు.. యావత్ దేశంలోనూ కుల గణన చేపట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేసినట్లు తేజస్వి వెల్లడించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తేజస్వి చెప్పారు. గతంలో బీహార్ అసెంబ్లీలో కుల గణనపై రెండు సార్లు తీర్మానాలు చేసినట్లు ఆయన తెలిపారు. కుల గణాంకాల ఆధారంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను రూపొందించే వీలు ఉంటుందని తేజస్వి అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

