Nitish Kumar: సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. బీహార్ గవర్నర్‌కు లేఖ అందజేత
Nitish Kumar : సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. బీహార్ గవర్నర్‌కు ఆయన తన లేఖను అందజేశారు. మునుముందు కూడా బీహార్‌లో అభివృద్ధి జరుగుతుందన్నారు. కొత్త సర్కారుకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు.
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తన పదవికి రాజీనామా చేశారు. బీహార్ రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా చేసిన రికార్డు ఆయన పేరిట ఉన్నది. 10 సార్లు ఆయన ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇటీవల నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. పాట్నాలోని లోక్‌భవన్‌లో ఇవాళ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యిద్ ఆటా హస్నైన్కు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజ్యసభ సభ్యుడిగా ఏప్రిల్ 19వ తేదీన నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకరం చేసిన విషయం తెలిసిందే. బీహార్ కొత్త సీఎం ఎవరన్నది ఇంకా తేలలేదు. కొత్త సీఎం బుధవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.
రాజీనామా గురించి నితీశ్ కుమార్ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. సీఎం పదవిని వదిలేయాలని నిర్ణయించానని, ఇవాళ జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత, గవర్నర్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక కొత్త ప్రభుత్వం ఇక్కడి బాధ్యతలను చూసుకుంటుందన్నారు. కొత్త సర్కారుకు తన పూర్తి మద్దతు, మార్గదర్శకత ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు జరుగుతాయన్నారు. బీహార్ చాలా అడ్వాన్స్ అవుతుందన్నారు.
आप जानते हैं कि 24 नवंबर, 2005 को राज्य में पहली बार एन०डी०ए० सरकार बनी थी। तब से राज्य में कानून का राज है और हम लगातार विकास के काम में लगे हुए हैं। सरकार ने शुरू से ही सभी तबकों का विकास किया है चाहे हिंदू हो, मुस्लिम हो, अपर कास्ट हो, पिछड़ा हो, अति पिछड़ा हो, दलित हो,…
— Nitish Kumar (@NitishKumar) April 14, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

