Bhupendra Patel | రెండోసారి గుజరాత్ సీఎం పీఠంపై భూపేంద్ర పటేల్
Bhupendra Patel | గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీఎల్పీ సమావేశంలో ఈ మేరకు సీఎంగా పటేల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం ప్రమాణం చేయనున్నారు.
Bhupendra Patel | గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు పటేల్ అభ్యర్థిత్వాన్ని పార్టీ బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. దాంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాస్సేపటి క్రితం గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాల్సిందిగా గుజరాత్ గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి చేయనున్నది.
బీజేపీఎల్పీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అర్జున్ ముండా హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గం మొత్తం శుక్రవారం అధికారికంగా రాజీనామా చేసింది. డిసెంబర్ 12న గాంధీనగర్‌లోని హెలిప్యాడ్ మైదానంలో భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికలకు ముందే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పటేల్‌ను బీజేపీ ప్రకటించింది. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు గాను 156 స్థానాలు గెలిచి బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

