Covaxin: కొవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై స్టడీ.. రిపోర్టును తప్పుపట్టిన ఐసీఎంఆర్
Covaxin side effects : కోవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై వచ్చిన బీహెచ్‌యూ రిపోర్టును ఐసీఎంఆర్ తప్పుపట్టింది. ఆ స్టడీ కోసం చేపట్టిన మెథడాలజీ, డిజైన్ సరిగా లేదని ఐసీఎంఆర్ డాక్టర్ రాజీవ్ భల్ తెలిపారు. బీహెచ్‌యూ చేపట్టిన సర్వేకు ఎటువంటి ఆర్థిక, సాంకేతిక సహాకారాన్ని అందించలేదని ఆయన స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: కొవాగ్జిన్( Covaxin) టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 30 శాతం మందికి వేర్వేరు అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు ఇటీవల బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. ఆ నివేదికను స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్‌లో ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ నివేదికపై ఇవాళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ స్పందించారు. కొవాగ్జిన్ టీకా వాడకంపై ప్రచురించిన నివేదిను ఆయన తప్పుపట్టారు. స్టడీ కోసం వాడిన మెథడాలజీ, డిజైన్‌ను విమర్శించారు. జర్నల్‌లో వచ్చిన నివేదిక తప్పుదోవ పట్టించేలా ఉందని ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ వెల్లడించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి, వ్యాక్సిన్ వేసుకోని వారి మధ్య తేడాను ఆ స్టడీ తేల్చలేకపోయిందని భల్ ఆరోపించారు. అందుకే కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌తో ఆ రిపోర్టును అనుసంధానం చేయలేమని ఆయన తెలిపారు.
బీహెచ్‌యూ చేపట్టిన కొవాగ్జిన్ స్టడీకి తాము అనుసంధానం చేయలేదని, ఆ స్టడీ కోసం ఎటువంటి ఆర్థిక సాయం కానీ, సాంకేతిక సాయం కానీ అందించలేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. కొవాగ్జిన్‌పై రిపోర్టు తయారు చేసిన రచయితలకు, ఆ జర్నలి ఎడిటర్‌కు లేఖ రాసినట్లు ఐసీఎంఆర్ డీజీ తెలిపారు. ఐసీఎంఆర్ గుర్తింపు ఇచ్చినట్లు ఉన్న అంశాన్ని ఆ నివేదిక నుంచి తొలగించాలని ఐసీఎంఆర్ డీజీ తన లేఖలో కోరారు. కొవాగ్జిన్ రిపోర్టుపై వివరణను కూడా పబ్లిష్ చేయాలని ఐసీఎంఆర్ ఆ జర్నల్ను కోరింది.
లాంగ్ టర్మ్ సేఫ్ట్ అనాలసిస్ ఆఫ్ ద బీబీవీ152 కరోనావైరస్ వ్యాక్సిన్ అనే పరిశోధన పత్రంపై విమర్శలు వచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్న ఏడాది లోపు మధ్యవయస్కులు, పెద్దలపై ఎటువంటి ఎఫెక్ట్స్ చూపించాయని స్టడీలో తేల్చారు. కొవాగ్జిన్ టీకా తీసుకున్న 926 మందిలో.. మూడవ వంతు ప్రజల్లో సెడ్ ఎఫెక్ట్స్ నమోదు అయినట్లు బీహెచ్‌యూ తన స్టడీలో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

