Bharat Bandh: ‘భారత్ బంద్’ నేపథ్యంలో.. పంజాబ్లో రైతు ఆత్మహత్య

చండీగఢ్: రైతుల ‘భారత్ బంద్’ నేపథ్యంలో పంజాబ్కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుధియానాకు చెందిన 65 ఏండ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే ‘భారత్ బంద్’కు కొన్ని గంటల ముందు ఆయన బలవన్మరణం చెందాడు. లుధియానాలోని నిరసన ప్రాంతానికి సమీపంలో మెడలో వేసుకున్ని కండువాతో ఒక పైప్కు ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం రైతులు ఈ విషయాన్ని గమనించారు. కాగా, మరణించిన రైతు భార్య కూడా ఢిల్లీ సరిహద్దులోని టిక్రి వద్ద గత పది నెలలుగా నిరసన తెలుపుతున్నది.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గత పది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు సోమవారం పది గంటలపాటు ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్య, ఇతర సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలను మూసివేయాని డిమాండ్ చేశారు.
అయితే ఆసుపత్రులు, మెడికల్ స్టోర్స్, రిలీఫ్, రెస్క్యూ వర్క్, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు హాజరయ్యే వ్యక్తులతో సహా అన్ని అత్యవసర సంస్థలు, సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు
సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

