Water Crisis | బెంగళూర్‌ను వెంటాడుతున్న నీటి కొరత : క్యాన్‌కు రూ. 2000కుపైగా వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్యాంకర్లు
Water Crisis : మార్చిలోనే బెంగళూర్‌కు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవడంతో నీటి సంక్షోభంలో నగరం విలవిలలాడుతోంది.
Water Crisis : మార్చిలోనే బెంగళూర్‌కు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవడంతో నీటి సంక్షోభంలో నగరం విలవిలలాడుతోంది. స్ధానికులు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటంతో అధిక ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్ధితి నెలకొంది. నీటి కోసం పొడవాటి క్యూల్లో వేచిఉండాల్సి వస్తోందని ఆర్ఆర్ నగర్ వాసులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు.
కొద్దిపాటి నీటితోనే ఇంట్లో వారంతా సర్దుకోవాల్సి వస్తోందని అంటున్నారు. స్నానం చేసేందుకు, వంట చేసుకునేందుకు కూడా తగినంత నీరు ఉండటం లేదని ఆర్ఆర్ నగర్‌కు చెందిన మహిళ దివ్య నీటి కష్టాలను ఏకరువు పెట్టారు. గత మూడు నెలలుగా నీటి కొరత వెంటాడుతోందని తాము నిత్యం బీఎండబ్ల్యూఎస్ఎస్‌బీ (బెంగళూర్ నీటి సరఫరా, సీవరేజ్ బోర్డ్) అధికారికి ఫోన్ చేస్తున్నా ఫలితం లేదని చెప్పారు. తాను ప్రతిరోజూ తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్‌కు వస్తున్నానని, ఇక్కడకు కేవలం ఒక వ్యక్తినే అనుమతిస్తున్నారని గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని వివరించారు.
ప్రైవేట్ ట్యాంకర్లు గతంలో క్యాన్‌కు రూ. 600-రూ.1000 వసూలు చేయగా ఇప్పుడు డిమాండ్ పెరగడంతో రూ. 2000కుపైగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్యాంకర్లను ధర తగ్గించాలని ప్రభుత్వం కోరిన తర్వాత వారు తమ ప్రాంతానికి రావడం నిలిపివేశారని తెలిపారు. తాను ప్రతిరోజూ ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపుతున్నా స్పందన లేదని ఆమె వాపోయారు.
Read More :
Health Tips | సన్నగా ఉండేవాళ్లు ఆరోగ్యకరంగా లావు అవ్వాలంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

