Payel Mukherjee: బెంగాలీ నటి పాయల్‌ను వేధించిన బైకర్
Payel Mukherjee: బెంగాలీ నటి పాయల్ ముఖర్జీ(Payel Mukherjee)ని.. ఓ బైకర్ వేధించాడు. కారులో వెళ్తున్న ఆమెను ఓ వ్యక్తి వెంబడించి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి పాయల్.. ఫేస్బుక్ వీడియోలో తెలిపింది.
కోల్‌కతా: వైద్యురాలి హత్యాచార ఘటనతో కోల్‌కతా తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో మరో వేధింపు ఘటన చోటుచేసుకున్నది. బెంగాలీ నటి పాయల్ ముఖర్జీ(Payel Mukherjee)ని.. ఓ బైకర్ వేధించాడు. కారులో వెళ్తున్న ఆమెను ఓ వ్యక్తి వెంబడించి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి పాయల్.. ఫేస్బుక్ వీడియోలో తెలిపింది. సదరన్ అవెన్యూలో తన కారు ముందు ఆ బైకర్ అడ్డంగా నిలబడ్డాడని, కారు నుంచి బయటకు రావాలని బెదిరించాడని ఆమె చెప్పింది. భయపడి కారు నుంచి బయటకు రాలేదని, అయితే ఆ వ్యక్తి తన కుడివైపు ఉన్న అద్దాన్ని పగలగొట్టాడని, ఆ ఘటనలో తన చేతికి గాయమైనట్లు ఆమె తెలిపింది. స్థానిక ప్రజలను తనను రక్షించినట్లు పాయల్ పేర్కొన్నది. ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కూడా ఆమె వెల్లడించింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లోనే ఇలా ఓ మహిళను వేధిస్తే, అప్పుడు నిర్జన ప్రదేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

