Yogi Adityanath | యూపీ సీఎం యోగికి బెదిరింపు కాల్.. పురోగతి సాధించిన ముంబై పోలీసులు.. మహిళా టెక్కీ అరెస్ట్
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను చంపేస్తామని బెదిరించిన కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ముంబై నగరానికి సమీపంలోని థానే నగరంలో నివసిస్తున్న ఫాతిమా ఖాన్ (24)ను అరెస్ట్ చేశారు.
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను చంపేస్తామని బెదిరించిన కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ముంబై నగరానికి సమీపంలోని థానే నగరంలో నివసిస్తున్న ఫాతిమా ఖాన్ (24)ను అరెస్ట్ చేశారు. పది రోజుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుంటే ‘బాబా సిద్ధిఖీ’ మాదిరిగా చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు ఫాతిమా ఖాన్ ను అరెస్ట్ చేసిన విచారించిన తర్వాత తన ఫోన్ నంబర్ నుంచే బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని ఆమె అంగీకరించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ఫాతిమా ఖాన్ మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె థానెలో తన కుటుంబంతో కలిసి జీవిస్తుందని, ఆమె తండ్రి టింబర్ బిజినెస్ చేస్తారని పోలీసు వర్గాల కథనం.
శనివారం సాయంత్రం ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంకు యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చింది. ఇటీవల కొన్ని వారాలుగా ముంబై పోలీసులకు వివిధ వ్యక్తులను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. వీటిలో అత్యధికం సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన బెదిరింపు కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల బాబా సిద్దిఖీ అనే ఎన్సీపీ నేతను గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కాల్చి చంపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

