Viral Pic | వెడ్డింగ్ రిసెప్షన్పై ఎలుగుబంటి దాడి..కొత్త జంటకు మిగల్చకుండా తినేసింది..!
వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట బంధుమిత్రులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తే ఓ ఎలుగుబంటి (Viral Pic) ఆ పార్టీలో నానా రచ్చ చేసింది.
న్యూయార్క్ : వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట బంధుమిత్రులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తే ఓ ఎలుగుబంటి (Viral Pic) ఆ పార్టీలో నానా రచ్చ చేసింది. అమెరికాలోని కొలరాడోకు చెందిన బ్రాండన్ మార్టినెజ్, కైలిన్ మెక్రాసీ-మార్టినెజ్ ఇటీవల బౌల్డర్ కౌంటీలో పెండ్లి చేసుకున్నారు. స్పెషల్ డే రోజు భారీ వర్షం కురవడంతో ఊహించని అతిధి ఆ పార్టీలో ప్రత్యక్షమైంది.
డెజెర్ట్ టేబుల్‌పైకి దూకిన ఎలుగుబంటి వెడ్డింగ్ పార్టీలో చెలరేగింది. డ్రింక్స్ తాగేసి టేబుల్‌ను చిందరవందర చేసింది. వంటకాలను ఆరగించి ఆవలించింది. కైలిన్ ఫేస్బుక్లో ఈ ఫొటోలను షేర్ చేస్తూ తనకెదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఓ ఎలుగుబంటి మా డెజెర్ట్ బార్‌కు వచ్చిన వేళ అంటూ..సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఎలుగుబంటి విన్యాసాలతో ఆ జంట ఏమనుకుందో ఏమో దానికోసం అదనపు ప్లేట్ తెప్పించి మరీ వడ్డించింది. ఎలుగుబంటి డెజెర్ట్ టేబుల్‌పై ఎక్కి అక్కడున్న వన్నీ ఆరగించిందని మార్టినెజ్ వాపోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో ఎలుగుబంటితో ఎవరికీ ముప్పు ఎదురవలేదు. ఎలుగుబంటి విహారంతో పాపం నవ దంపతులకు లెమన్ బార్స్, కనోలిస్ వంటి వారి ఫేవరెట్ రెసిపీలు మిస్ అయ్యాయని నెటిజన్లు కామెంట్ చేశారు.
Read More :
Japanese Couple | రజనీ ‘జైలర్’ చూడటానికి ఒసాకా నుంచి చెన్నై వచ్చిన జపనీస్ దంపతులు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

