Murder case | బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు.. ఫోరెన్సిక్ పరీక్షలకు మాంసం ముద్దలు
Murder case | బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. కోల్‌కతాలో ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్‌లో దొరికిన మాంసం ముద్దలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
Murder case : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. కోల్‌కతాలో ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్‌లో దొరికిన మాంసం ముద్దలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ మాంసం ముద్దలు అన్వరుల్ అజీమ్‌కు చెందినవేనా కాదా.. అనే సంగతి ఫోరెన్సిక్ పరీక్షల్లో బయటపడనుంది.
ఎంపీ అన్వరుల్ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్మెంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో ఇటీవల పశ్చిమబెంగాల్ సీఐడీ బృందాలు మాంసపు ముద్దలను గుర్తించాయి. మొత్తం మూడున్నర కిలోల మాంసం ముద్దలు, కొన్ని వెంట్రుకలు సెప్టిక్ ట్యాంక్‌లో లభ్యమైనట్లు ఓ దర్యాప్తు అధికారి వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయన హత్యకు గురైన ఫ్లాట్‌లోని బాత్రూమ్ ద్వారా రక్తం మురుగునీటి పైపులగుండా వెళ్లినట్లు భావించామని పోలీసు అధికారి తెలిపారు.
హౌసింగ్ కాంప్లెక్స్ బాధ్యుల సహాయంతో ఆ మురుగునీటి పైపులైన్లు, సెప్టిక్ ట్యాంకును పరిశీలించామని, ఈ క్రమంలోనే మాంసపు ముద్దలను గుర్తించామని చెప్పారు. బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ వైద్య చికిత్స కోసం ఈ నెల 12న కోల్‌కతా వచ్చారు. తన స్నేహితుడికి చెందిన అపార్ట్మెంట్లో బస చేసిన ఆయన.. కొన్నిరోజుల తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఓ మహిళ సహాయంతో నిందితులు ఆయనను హనీట్రాప్‌లోకి దింపి, ఆయన బస చేసిన అపార్ట్మెంట్లోనే గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. నిందితుడు వృత్తిరీత్యా కసాయి అని, ఎంపీని హత్య చేసిన అనంతరం శరీరాన్ని 80 ముక్కలుగా చేసి, వాటికి పసుపు కలిపి నగరంలోని బాగ్జోలా కాలువ, ఇతర ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఆయన శరీర భాగాల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
అయితే వాటిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఇటీవల వర్షాలు కురవడంతో శరీర భాగాలు కొట్టుకొనిపోయి ఉంటాయని, జంతువులు కూడా వాటిని తినే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కూడా కోల్‌కతాలో దర్యాప్తు చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

