French fries | ఫ్రెంచ్ ఫ్రైస్ తినకూడదన్న భర్త.. గృహ హింస కేసు పెట్టిన భార్య..!
French fries | కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ జంటకు ఇటీవలే బిడ్డ జన్మించింది. దాంతో కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగంగా పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలని భార్యకు సూచించాడు. ఆరోగ్యానికి మేలు చేసేది ఏది అడిగినా తెచ్చి ఇచ్చాడు.
French fries : కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ జంటకు ఇటీవలే బిడ్డ జన్మించింది. దాంతో కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగంగా పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలని భార్యకు సూచించాడు. ఆరోగ్యానికి మేలు చేసేది ఏది అడిగినా తెచ్చి ఇచ్చాడు. ఈ క్రమంలో భార్య తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని ఉందని చెప్పింది. బాలింతరాలు కావడంతో జంక్ ఫుడ్ వద్దని భర్త అభ్యంతరం చెప్పాడు.
దాంతో ఆగ్రహానికి లోనైన భార్య నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై గృహ హింస కేసు పెట్టింది. తన భర్త తనను ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడంలేదని, ఇది గృహహింస కిందికే వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు భర్తను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విషయం తెలుసుకుని ఇద్దరికీ రాజీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా భార్య వినిపించుకోలేదు.
దాంతో ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ వింత కేసును విచారించిన జడ్జి.. జరిగిన సంగతి తెలుసుకుని భార్యను మందలించారు. భార్య ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదని చీవాట్లు పెట్టాడు. ఆమె భర్తపై పోలీసులు నమోదు చేసిన కేసుపై స్టే విధించారు. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లేందుకు అనుమతించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

