కేంద్రం కీలక నిర్ణయం.. ఇటలీ రక్షణ సంస్థపై నిషేధం ఎత్తివేత!
Ban removed from Italian firm Leonardo, ban was imposed in 3600 crore VVIP helicopter scam | రూ.3,600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించి.. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌లో భాగమైన ఇటలీ రక్షణ రంగ దిగ్గజం లియోనార్డోపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ నిర్ణయించింది. పలు షరతులతో ఈ నిర్ణయం

న్యూఢిల్లీ: రూ.3,600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించి.. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌లో భాగమైన ఇటలీ రక్షణ రంగ దిగ్గజం లియోనార్డోపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ నిర్ణయించింది. పలు షరతులతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇటలీ సంస్థపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగనున్నది. భారత్‌లో ఆర్థిక సమస్యల విషయానికి వస్తే.. లియోనార్డో మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని, అంటే.. లియోనార్డో ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందం ఆధారంగా భారత్‌పై ఎలాంటి వాణిజ్య దావా వేయలేరని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నిషేధం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు సంబంధించింది కాగా.. కేసులో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చాక ఇటాలియన్ సంస్థతో ఒప్పందాన్ని నిలిపివేశారు. ఇందులో బ్లాక్ టార్పెడో డీల్ సైతం ఉండగా.. నావికాదళం కొనుగోలు కోసం ఆమోదించారు. సమాచారం మేరకు.. ఇటలీ సంస్థ అభ్యర్థన మేరకు న్యాయమంత్రిత్వ శాఖ, దర్యాప్తు సంస్థలను సంప్రదించిన అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖ నిషేధం ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రూ.3600కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో రాజీవ్ సక్సేనా అనే వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్ సక్సేనా దుబాయిలో నివాసం ఉండగా.. అతన్ని 2019లో భారత్‌కు తీసుకువచ్చి అరెస్టు చేశారు. 2010లో రూ.3,600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లను కొనుగోలు చేసిన విషయం మూడేళ్ల తర్వాత వెలుగులోకి రావడంతో పాటు భారత వైమానిక దళం, భారత ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయంపై ఆరోపణల నేపథ్యంలో 2013-14లో యూపీఏ ప్రభుత్వం ఇటాలియన్ సంస్థతో ఒప్పందాలపై నిషేధం విధించింది. హెలికాప్టర్ల కొనుగోళ్ల డీల్‌లో యూరోపియన్ ఏజెన్సీలు అగస్టా వెస్ట్‌ల్యాండ్ అధికారులను అరెస్టు చేయడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

