Ban on SIMI: చట్ట విరుద్ధమైన ‘స్టూడెంట్స్ ఆఫ్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI)’పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద సిమిపై మరో ఐదేళ్లపాటు నిషేధం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ తన అధికారిక ‘ఎక్స్ (X)’ ఖాతాలో సోమవారం ప్రకటించింది.
మోదీ ప్రధాని అయిన తర్వాత తొలిసారి 2014లో ఉపా చట్టం కింద ‘సిమి’పై నాలుగేళ్ల నిషేధం విధించారు. ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు నిషేధాన్ని పొడిగించారు. ఇప్పుడు మరోసారి ఐదేళ్లపాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. భారత సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, శాంతి, మతసామరస్యానికి భంగం కలిగించడంలో ‘సిమి’ ప్రమేయం ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.